ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ కలిసిన తర్వాత జనసేన పార్టీ పెద్దగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లలేదు అనే విషయం చాలా వరకు స్పష్టంగా చెప్పవచ్చు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఎంత కష్టపడినా సరే పార్టీలో ఉన్న కీలక నాయకులు ఎవరూ కూడా బయటకు రాకపోవడంతో అలాగే నాదెండ్ల మనోహర్ కు పార్టీ నుంచి సహకారం లేకపోవడం భారతీయ జనతా పార్టీ తనను లెక్క చేయకపోవడం పవన్ కళ్యాణ్ ని బాగా ఇబ్బంది పెట్టిన విషయం.

ముఖ్యంగా జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాల విషయంలో భారతీయ జనతా పార్టీ నుంచి స్పందన లేకపోవడం పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఈ మధ్యకాలంలో మారింది అనే అభిప్రాయం చాలా వరకు వినబడుతున్న మాట. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల సమస్య గురించి జనసేన పార్టీ పోరాటం చేసిన సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి పెద్దగా పవన్ కళ్యాణ్ కి సహాయ సహకారాలు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు కూడా సీరియస్ గానే భారతీయ జనతా పార్టీ విషయంలో ఉన్నారు.

అదేవిధంగా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నేతల అభిప్రాయం కూడా ఈ మధ్యకాలంలో మారింది అనే భావన కూడా కొంత వరకు ఉంది. ఇక సోము వీర్రాజు పార్టీ నాయకులను కట్టడి చేస్తున్నారనే పవన్ కళ్యాణ్ భావిస్తూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో తనతో కలిసి వచ్చే నాయకులను జనసేన పార్టీలోకి ఆహ్వానించారని ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అలాగే కొంతమంది రాయలసీమ నాయకులను పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నారని త్వరలోనే వీరందరూ కూడా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సోము వీర్రాజు తీరుపై జనసేన పార్టీలో కొన్ని రోజులనుంచి ఆగ్రహం పెరుగుతుందనే భావన కూడా ఎప్పటినుంచో మనం వింటున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp