వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఫుల్ బిజీ అవుతున్నారు. ఏపీలో ఇప్పుడు మొత్తం 14 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. ఈ 14 ఎమ్మెల్సీ స్థానాలను ఎలాంటి పోటీ లేకుండా అధికార‌ వైసీపీయే గెలుచు కోనుంది.  ఇందులో 11 స్థానాలు స్థానిక సంస్థల కోటా కింద ఎన్నిక కావాాల్సి ఉంది.. మ‌రో మూడు స్థానాలు ఎమ్మెల్యే కోటాలో ఎంపిక కావాల్సి ఉంది. అయితే ఇటీవ‌ల వ‌ర‌కు క‌రోనా నేప‌థ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు మొన్నటి వరకూ జరగకపోవడంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా ఈ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌లేదు.

ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముగియ‌డంతో పాటు అధికార వైసీపీ ఏక‌ప‌క్షంగా విజయం సాధించింది. దాదాపు అన్ని కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను వైసీపీ ఖాతాలో ప‌డ‌డంతో ఇప్పుడు స్థానిక సంస్థ‌ల కోటాలో ఎన్నిక‌లు జ‌రిగే అన్ని ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే ప‌డ‌తాయి. అస‌లు ఈ ఎన్నిక ల‌లో టీడీపీ పోటీయే పెట్ట‌క్క‌ర్లేదు. ఇక ఎమ్మెల్యే ల కోటాలో ఎన్నిక‌లు జ‌రిగే మూడు ఎమ్మెల్సీ స్థానాలు కూడా వైసీపీ యే గెలుచు కోనుంది.

అయితే ఇప్పుడు వైసీపీ లో ఈ 14 మంది కొత్త ఎమ్మెల్సీలు ఎవ‌రు అనేదే ఆస‌క్తి గా మారింది. ఈ సారి కొత్త ఎమ్మెల్సీ ల‌లో ఎక్కువ మంది ఉత్త రాంధ్ర మూడు జిల్లా ల‌తో పాటు గోదావ‌రి జిల్లాల‌కు చెందిన వారే ఎక్కువుగా ఉంటారని వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఈ 14 మంది ఎమ్మెల్సీలలో కాపు సామాజికవర్గంతో పాటు బీసీలకు కూడా ఎక్కువ మందికి అవకాశం ఉంటుంద‌ని టాక్ ?  ఏకంగా 14 ఎమ్మెల్సీ ప‌ద‌వులు కావ‌డంతో ఆశావాహులు కూడా భారీగా ఉండ‌డంతో జ‌గ‌న్ ఇప్పుడు వీరిని ఎంపిక చేసే ప‌నిలో ఫుల్ బిజీ కానున్నారు. మ‌రి ఆ అదృష్ట వంతులు ఎవ‌రో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: