ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రెండున్న‌ర సంవ‌త్స‌రాల క్రితం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినంతనే తన కేబినెట్ లో ఉన్న వారిని స‌గం పాల‌న త‌ర్వాత మారుస్తాన‌ని చెప్పారు. అప్పుడు జ‌గ‌న్ త‌న కేబినెట్లో ఉన్న వారిలో 90 శాతం మంత్రుల‌ను మార్చేసి వారి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పారు. ఇక ఇప్పుడు మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న పై వార్త‌లు వ‌స్తుండ‌డంతో జ‌గ‌న్ కొత్త కేబినెట్లో ఎవ‌రెవ‌రు మంత్ర‌లుగా  ఉంటార‌న్న దానిపై ఎవ‌రి చ‌ర్చ‌ల్లో వారు మునిగి తేలుతున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కాపు సామాజిక వ‌ర్గం కోటాలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి ప‌ద‌వి ఖాయం అంటున్నారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఆయ‌న సొంత జిల్లా లో ఓడించి జెయింట్ కిల్ల‌ర్ గా రికార్డుల‌కు ఎక్కారు. అప్పుడే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అనుకున్నారు. అయితే అదే జిల్లాలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డ‌తో గ్రంథికి ఛాన్స్ ద‌క్క లేదు. ఇక ఇప్పుడు కాపు కోటాలో ఆ జిల్లా నుంచి గ్రంథికి బెర్త్ దాదాపు ఖ‌రారైంద‌ని అంటున్నారు.

ఇక క‌మ్మ కోటాలో గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు కూడా మంత్రి ప‌ద‌వి ఖ‌రారైన‌ట్టు గా పార్టీలో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే ఆయ‌న్ను ముందుగా స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీని చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న్ను కేబినెట్లోకి తీసుకుంటారు.ఇక ఆశ్చ‌ర్య క‌రంగా క‌డ‌ప జిల్లా కు చెందిన సీనియ‌ర్ నేత సీ రామ‌చంద్ర‌య్య పేరు కూడా కేబినెట్లో వినిపిస్తోంది. ఇక జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావాతి పేరు కూడా హోం మంత్రి రేసులో ఉంది. మ‌రి జ‌గ‌న్ మ‌దిలో ఫైనల్ గా ఎవ‌రెవ‌రు ఉన్నారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: