జ‌గ‌న్ కేబినెట్లో కొత్త మంత్రులుగా ఏ యే జిల్లాల నుంచి ఎవ‌రెవ‌రు ఉంటారు ? అన్న దానిపై ఆయా జిల్లా ల‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. ఇక కీల‌క‌మైన కృష్ణా జిల్లా నుంచి కేబినెట్లో ఎవ‌రు ఉంటార‌న్న‌ది ప్ర‌స్తుతానికి పెద్ద ఫ‌జిల్ గా మారింది. ఇప్పుడు ఈ జిల్లా నుంచి క‌మ్మ కోటాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తో పాటు కాపు కోటాలో బంద‌రు ఎమ్మెల్యే పేర్ని నాని .. ఇక బెజ‌వాడ న‌గ‌రంలో వైశ్య కోటాలో వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస్ మంత్రులుగా ఉన్నారు. జిల్లా లో మూడు సామాజిక వ‌ర్గాల నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు.

అయితే ఇప్పుడు ప్ర‌క్షాళ‌న‌లో ఈ ముగ్గురు మంత్రుల‌ను జ‌గ‌న్ త‌ప్పించేస్తారా ?  లేదా క‌మ్మ కోటాలో మంత్రి గా ఉన్న ఫైర్ బ్రాండ్ కొడాలి నానిని మాత్రం కంటిన్యూ చేస్తారా ? అన్న‌ది మాత్రం ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్లో మంత్రి గా ఉన్న బాలినేని శ్రీనివాస్ చెప్పి న‌ట్టు నూటికి నూరు శాతం మంత్రుల‌ను మార్చే స్తే మాత్రం ముగ్గురు ఎగిరి పోతారు. అప్పుడు అంద‌రూ కొత్త మంత్రులే వ‌స్తారు.

ఇక కొత్త కేబినెట్లో బీసీ కోటాలో పెన‌ల‌మూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తో పాటు పెడ‌న ఎమ్మెల్యేఏ జోగి ర‌మేష్ పోటీ లో ఉన్నారు. అయితే వీరిద్ద‌రు బీసీ లే అయినా వేర్వేరు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు. నెల్లూరు లో మంత్రి అనిల్‌ను త‌ప్పిస్తే పార్థ‌సార‌థికి ఛాన్స్ ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఇక కొత్త మంత్రి వేణ‌ను త‌ప్పిస్తేనే జోగి ర‌మేష్‌కు అవ‌కాశం ఉంటుంది. ఇక కాపు కోటాలో ప్ర‌స్తుతం విప్ గా ఉన్న జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను రేసులో ఉన్నారు. మ‌రి ఈ ముగ్గురిలో ఎవ‌రికి కేబినెట్ ల‌క్ ఉంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: