రాయలసీమ కు వచ్చే జలాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కాస్త గట్టిగా పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నది. రాజకీయంగా ఇది ఇప్పుడు సీమలో కాస్త హాట్ టాపిక్ కూడా అయింది. నేడు హిందూపురం లో టీడీపీ సదస్సు జరిగింది. ఈ సదస్సుకి నందమూరి బాలకృష్ణ కూడా హాజరు అయ్యారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 512 ఏపీ కి, 314 టీఎంసీల నీటి పంపకాలు జరిగాయి అని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్50: 50 వాటా అడుగుతున్నాడు అని అన్నారు ఆయన.

సీఎం చేతకాని తనం తో అన్యాయం జరుగుతోంది అని వెల్లడించారు. మనకు రావాల్సిన నీటిని కేసీఆర్ కాజేస్తుంటే... అడిగే పరిస్థితి ఈ ప్రభుత్వం లో లేదు అని రాయలసీమ కు అన్యాయం జరుగుతుంది అని విమర్శించారు. రాయలసీమ లో నీళ్లు ఇచ్చిన మహానుభావుడు ఎన్ఠీఆర్ అని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను చంద్రబాబు కొనసాగించారు అని అన్నారు. గాలేరు నగరి, హంద్రీనీవా కు రూ.2,500 కోట్ల నిధులు వెచ్చించాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. హిందూపురం కి కృష్ణా జలాలు తెచ్చి తాగునీటి సమస్య తీర్చిన వ్యక్తి బాలకృష్ణ అని గుర్తు చేసుకున్నారు.

మనం సాధించుకున్న వాటిని కాపాడుకోలేని అసమర్థత ప్రభుత్వానిది అని జూరాల ను కేఆర్ ఎం బీ కి అప్పగించడం లేదు అని వ్యాఖ్యలు చేసారు. నీళ్లు వచ్చే మొదటి ప్రాజెక్ట్  బోర్డు పరిధి లో లేకుంటే మనకు నీళ్లు రావు అని అన్నారు. ఇటీవల కేసీఆర్ జలశక్తి మంత్రి ని కలిసి లాబీయింగ్ చేశారు అని వైసీపీ ఎంపీలు ఢిల్లీ లో ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఎందుకు ప్రశ్నించడం లేదు అని నిలదీశారు కాల్వ.  చంద్రబాబు  మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ కు భవిష్యత్తు ఉంటుంది అని ప్రస్తావించారు. వచ్చే సమావేశం తిరుపతి లో జరపాలని తీర్మానించాం అని అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: