చింతచచ్చినా పులుపు చావలేదనే చందన.. చైనా సంక్షోభంలో ఉన్నప్పటికీ క్షిపణి ప్రయోగాలను మాత్రం మానుకోవడంలేదు. అయితే ఈ సారి ప్రయోగాలు అంతరిక్షాన్ని లక్ష్యంగా చేసుకుని చేస్తుంది. అక్కడ ఉన్న ఎవరి సాటిలైట్ లను ధ్వంసం చేద్దామని ఈ పనికి పూనుకుందో కానీ, అసలు చేసినట్టే తెలియకుండా రహస్యంగా చేసింది ఈ ప్రయోగం. దానిని బ్రిటన్ లోని ప్రముఖ పత్రిక బట్టబయలు చేసింది. చైనా లోంచి అసలు ఏమి జరుగుతుంది అనేది వార్తలు కూడా ప్రభుత్వం చెపితేనే వస్తాయి అనేది ఎలాగూ తెలిసిందేగా. తాజా తాలిబన్  లు కూడా అదే అనుసరిస్తున్నారు. ఏది ఏమైనా చైనా ఇంక మారదు అనేది స్పష్టం అవుతుంది.

ఇటువంటి భయానక ఆయుధాలు తయారుచేసి ఎవరిపై పైచేయి సాధించాలని చైనా చూస్తుంది. అందరిని చంపేసి అది మాత్రమే భూమిని పరిపాలించుకుంటుందా.. లేక అప్పుడు కూడా నాదే ఈ సామ్రాజ్యం అనుకుంటూ ఒక పిచ్చలో బ్రతికేస్తుందా అనేది చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి అయితే అనుకోవచ్చు, ప్రతిసారి సరిహద్దులలో అందరితో గొడవలు, కనిపించిందంతా తమదే అనుకుంటూ ప్రచారం, ఇలా ఎన్నో చేస్తున్నప్పటికీ దానిని ఎందుకు మిగిలిన వాళ్ళు భరిస్తున్నారు అనే కనీస ఆలోచన చైనాలో లేదా దానిని పాలిస్తున్నాను అనుకుంటున్న మూర్ఖుడిలో వస్తుందా లేదా..! ఒక్క మూర్ఖుడు ఇంత యాగీ చేస్తున్నాడు.

తాజా క్షిపణి కూడా కేవలం లక్ష్యానికి 32 కిలోమీటర్ల దూరం లో వెళ్లిందని బ్రిటన్ పత్రిక  తెలిపింది. ఈ హైపర్ సోనిక్ సాంకేతికత అమెరికాను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది అని ఆ పత్రిక స్పష్టం చేసింది. ఎందుకంటే ఇలాంటి సాంకేతికత ఇప్పటి వరకు అమెరికా, రష్యా లాంటి ఐదు దేశాలకు మాత్రమే ఉందని ఆ పత్రిక వెల్లడించింది. ఈ సాంకేతికత తో క్షిపణి ధ్వని కంటే 5 రేట్లు అధిక వేగంతో ప్రయాణిస్తుందని  తెలిపింది. ఈ తీరుగా చైనా సరికొత్త క్షిపణులను రూపొందిస్తు పోతే, అమెరికా, జపాన్ ల సాంకేతికత, రక్షణ వ్యవస్థపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: