పాకిస్థాన్ అన్న దాయాదికి దేశమంతా పగే. అంతటా ప్రతీకారమే. ఆ జ్వాలలో తాను మండుతూ ఆ మంటను కొంత భారత్ కి కూడా పెడితే కానీ పాక్ ఎపుడూ శాంతించదు. అందుకే గతె ఏడున్నర దశాబ్దాలుగా పాకిస్థాను కాశ్మీర్ లో ఉగ్ర చిచ్చు రేపుతూనే ఉంది.

పాకిస్థాన్ బుద్ధి తెలిసినా మెతక వైఖరితో నాటి పాలకులు కొందరు ఊరుకున్నారు. ఇక మోడీ ప్రధానిగా  వచ్చాక మాత్రం పాక్ ఆటలు అసలు ఎక్కడా ఏ కోశానా సాగడం లేదు. కీలెరిగి వాత పెట్టే మోడీ ముందు దాయాది  పాక్  వెలవెలపోతోంది. అదే టైమ్ లో మోడీ సర్జికల్స్ స్ట్రైక్స్ అంటే పాక్ కి నిండా వణుకే. ఈ మధ్యనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాక్ కి గట్టి వార్నింగే ఇచ్చారు. మరో సారి కాశ్మీర్ లో మంటలు రేపితే చూస్తూ ఊరుకోమని, సర్జికల్ స్ట్రైక్స్ తో ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతామని హెచ్చరించారు.

ఈ మాట అమిత్ షా అంటున్నా బీజేపీకి ఇంకా ఏవో సరి కొత్త వ్యూహలూ, పెద్ద  ఆలోచనలు ఉన్నాయనే అంతా అనుకున్నారు. ఇక తాజాగా కేంద్ర మంత్రి రాం దాస్ అయితే పాకిస్థాను ఆక్రమించుకున్న కాశ్మీర్ ని వదిలేసి వెనక్కు పోవాలని చాలా గట్టిగానే నే కోరారు. అంటే మోడీ అమిత్ షా మదిలో ఇదే భావన ఉందా. వారి ఆలోచనలు ఇవేనా, బీజేపీ సర్కార్ పాక్ మీద గట్టిగా మరో మారు విరుచుకుపడుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. అదే నిజం అయితే పాకిస్థాన్ కి ఈసారి తగిలేది మాడు పగిలే  దెబ్బ కాదు, ఇక మటాష్ అయినట్లే అంటున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని అడ్డాగా చేసుకుని ఉగ్ర మూకలను పెంచి పోషిస్తూ దొడ్డి దారిన కాశ్మీర్ లో వదులుతూ బయటకు మాత్రం ఏమెరగని బుద్ధిమంతురాలిగా ఫోజు కొడుతున్న పాకిస్థాన్ ఆటలు కట్టించాలంటే పీఓకేని స్వాధీనం చేసుకోవడం ఒక్కటే మార్గమని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. మరి మోడీ హయాంలో అది జరుగుతుందా. అందుకే కేంద్ర మంత్రి రాం దాస్ నోటి వెంట ఆ మాటలు వచ్చాయా అంటే అవును అనే అనుకోవాలేమో. ఏది ఏమైనా బీజేపీ సర్కార్ దూకుడు చేస్తే పాకిస్థాని కి మూడినట్లే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: