ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ గ్రేడ్, జూనియర్ టైమ్ స్కేల్ (JTS) గ్రేడ్ ఇంకా యూత్ ఆఫీసర్ పోస్టుల కోసం ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ స్థానాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు upsc.gov.in లో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.ఇక UPSC ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో 56 ఖాళీలను భర్తీ చేయాలని చూస్తోంది.ఇక దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 28.

ఇక ఈ పోస్టుల ఖాళీల వివరాలు:

డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్- 1

ప్రైవేట్ సెక్రటరీ- 1

సీనియర్ గ్రేడ్- 20

జూనియర్ టైమ్ స్కేల్ (JTS) గ్రేడ్- 29

యూత్ ఆఫీసర్- 5

అర్హత విషయానికి వస్తే..

డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.B.E కలిగిన వారు కూడా ఈ పోస్టులకు పరిగణించవచ్చు. కాని కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో B.టెక్ చేసి ఉండాలి.

ప్రైవేట్ సెక్రటరీ - అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. వారు కంప్యూటర్లలో మాత్రమే డిక్టేషన్ (నిమిషానికి 100 పదాలు) ఇంకా ట్రాన్స్క్రిప్షన్ (40 నిమిషాలు - ఇంగ్లీష్, 55 నిమిషాలు - హిందీ) లో మంచిగా టైప్ చేయగలగాలి.

సీనియర్ గ్రేడ్ - అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ డిగ్రీని కలిగి ఉండాలి.అలాగే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి జర్నలిజం ఇంకా మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసుండాలి.

జూనియర్ టైమ్ స్కేల్ (JTS) గ్రేడ్ - ఈ స్థానానికి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, సోషల్ వర్క్ లేదా లేబర్ వెల్ఫేర్ లేదా పారిశ్రామిక సంబంధాలలో డిప్లొమా లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా లేబర్ లా తప్పనిసరిగా ఉండాలి.

యూత్ ఆఫీసర్ - అభ్యర్థులు యువత పని లేదా యువత సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడంలో రెండు సంవత్సరాల అనుభవం కలిగిన గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.

వయో పరిమితి వచ్చేసి...

డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ - 30 సంవత్సరాలు

ప్రైవేట్ సెక్రటరీ - 30 సంవత్సరాలు

సీనియర్ గ్రేడ్ - 30 సంవత్సరాలు

జూనియర్ టైమ్ స్కేల్ (JTS) గ్రేడ్ - 35 సంవత్సరాలు

యూత్ ఆఫీసర్ - 30 సంవత్సరాలు

మరింత సమాచారం తెలుసుకోండి: