ఏపీ సీఎం జగన్ పరపతి ప్రధాని మోదీ దగ్గర పెరిగిందా.. అవునేమో అనిపిస్తోంది. తాజాగా ఓ కేంద్రమంత్రి మాటలు చూస్తుంటే.. జగన్ తో సత్సంబంధాల కోసం బీజేపీ ప్రయత్నిస్తోందా అన్న అనుమానం కూడా రాకమానదు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీజేపీ, వైసీపీ బంధం పై మరోసారి చర్చకు దారి తీశాయి.


ఇంతకీ ఈ కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఏమన్నాడు.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ను ఎన్డీఏలోకి రాందాస్ ఆహ్వానించారు. జగన్ ఎన్‌డీఏలో చేరాలని ఆయన కోరుకున్నారు. జగన్ తనకు మంచి మిత్రుడు అంటున్న కేంద్ర మంత్రి  రాందాస్ అథవాలే.. జగన్ ఎన్డీఏలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు కూడా మేలు జరుగుతుందని సంకేతాలు కూడా పంపారు. అంతే కాదు.. మూడు రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోనిదేనని  కేంద్ర మంత్రి రామ్ దాస్ అధవాలె జగన్‌ను బుట్టలో వేసుకునే ప్రయత్నం కూడా చేశారు.


మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోవలసింది రాష్ట్రమేనని  కేంద్ర మంత్రి  రాందాస్ అథవాలే క్లారిటీగా చెప్పేశారు. అంతే కాదు.. ఏపీ ఎన్డీఏలో చేరడం ద్వారా ఏపీకి మేలు జరుగుతుందని...  హైవే ప్రాజెక్టులు, నీటి పారుదల ప్రాజెక్టులు వంటి విషయాల్లో ఏపీకి మంచి సాయం అందుతుందని ఊరిస్తున్నారు. కేంద్ర మంత్రి ఒకరు ఇంతగా బతిమాలుతూ జగన్‌ను ఎన్డీఏలోకి ఆహ్వానించడం అనే పరిణామం ఏదో యథాలాపంగా అన్న మాటలుగా మనం భావించలేం.


వైసీపీ మొదటి నుంచి బీజేపీ అనుకూల వైఖరే అవలంబిస్తోంది. పార్లమెంటులో మోడీ సర్కారుకు అన్నివిధాలా సాయం చేస్తూనే ఉంది. ఓటింగ్ సమయాల్లో బీజేపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటోంది. ఇలా అన్నివిధాలా జగన్‌ పై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే ఇప్పుడు జగన్‌కు ఎన్డీఏలోకి ఆహ్వానం అంది ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి జగన్ కు ప్రధాని మోడీ దగ్గర మంచి పరపతే ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ పరిణామం చూస్తుంటే..!?

మరింత సమాచారం తెలుసుకోండి: