ప్రపంచ దేశాలు అన్నింటినీ ఎంతో ప్రాణ భయంతో పరుగులు పెట్టించిన మహమ్మారి కరోనా వైరస్ ఇంకా మనల్ని బీవదిలి వెళ్ళలేదు. మనము ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మళ్ళీ వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా కొంచెం తగ్గినట్లే అనిపించినా ఎక్కడో ఒక మూల చిన్న భయం తల్లితండ్రులకు కునుకు లేకుండా చేస్తోంది. దానికి కారణం ఇంకా చిన్న పిల్లలకి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. అయితే తాజాగా జరిపిన ఒక పరిశోధన లో కొన్ని వాస్తవాలు అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ కరోనా వైరస్ ఒక అంటువ్యాధి అని తెలిసిందే. ఒకరి నుండి మరొకరికి చాలా ఈజీగా ఇది వ్యాప్తి చెందుతుంది.

అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం పెద్దల కన్నా పిల్లలే ఎక్కువగా కరోనాను వ్యాప్తి చేయగలరు అని నిరూపితం అయింది. దీని కోసం కోవిడ్  వచ్చిన 21 సంవత్సరాల వయసున్న 110 మందిని ఎంపిక చేశారు. మామూలుగా పెద్ద వారిలో వైరస్ సోకితే లక్షణాలు తెలిసిపోతాయి. కానీ పిల్లల్లో మాత్రం పెద్దగా లక్షణాలు బయటపడవు. కాబట్టి వీరిపై ఎవ్వరికీ అనుమానం రాదు. తద్వారా వీరితో ఎప్పటి లాగే ఉంటారు. అలాంటప్పుడు కరోనా చాలా సులభంగా పిల్లల నుండి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. అయితే లక్షణాలు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరితో భద్రత ప్రమాణాలను తీసుకుని వ్యవహరించడం మంచిది.  

ఈ మధ్యనే పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది అని కేంద్ర ప్రభుత్వ తెలిపింది. ప్రపంచంలో కూడా   అనేక దేశాల్లో కోవ్యాక్సిన్ టీకా పిల్లలకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. వీలైనంత త్వరలో పిల్లలకు వ్యాక్సిన్ లు ఇవ్వటం పూర్తి అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. మరి చూద్దాం పిల్లలు అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో...!

మరింత సమాచారం తెలుసుకోండి: