గత ఎన్నికల్లో జగన్ గాలిలో చాలామంది నాయకులు....మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. ఇలా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేల గురించి...ఆయా నియోజకవర్గాల ప్రజలకు పెద్దగా అవగాహన లేదనే చెప్పొచ్చు. అయితే ఎన్నికల్లో జగన్ బొమ్మని చూసి ప్రజలు ఎమ్మెల్యేలని గెలిపించేశారు. అయితే మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు...సొంతంగా ఏమన్నా ఇమేజ్ పెంచుకున్నారా? అంటే ఎక్కువమంది ఎమ్మెల్యేలు మాత్రం సొంత ఇమేజ్ పెంచుకోలేదనే చెప్పొచ్చు.

ఇప్పటికీ వారు జగన్ ఇమేజ్‌తోనే బండి లాగిస్తున్నారు. ఇక ఇలాంటి వారికి సెకండ్ టైమ్ మళ్ళీ గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయనే చెప్పొచ్చు. అయితే కృష్ణా జిల్లాలో ఫస్ట్ టైమ్ గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎంతమంది సొంత ఇమేజ్ పెంచుకున్నారు....ఎంతమందికి మళ్ళీ సెకండ్ టైమ్ గెలిచే అవకాశాలు ఉన్నాయనే విషయం ఒక్కసారి గమనిస్తే....అవనిగడ్డలో సింహాద్రి రమేష్...పామర్రులో అనిల్ కుమార్...మైలవరంలో వసంత కృష్ణప్రసాద్...నందిగామలో మొండితోక జగన్మోహన్ రావు....కైకలూరులో దూలం నాగేశ్వరరావులు మొదటి సారి ఎమ్మెల్యేలుగా గెలిచారు.

అవనిగడ్డలో రమేశ్ అంతకముందు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు...కానీ 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో గెలిచేశారు. అయితే రమేష్‌ ఎమ్మెల్యేగా రెండున్నర ఏళ్లలో అంతగా క్లిక్ అవ్వలేదనే చెప్పొచ్చు. రానున్న రెండున్నర ఏళ్ళు కష్టపడితే రమేష్‌కు ఏదైనా సెకండ్ ఛాన్స్ ఉండే అవకాశముంది. ఇటు పామర్రులో అనిల్ కుమార్ పనితీరు పెద్దగా బాగోలేదనే తెలుస్తోంది. ఈయనకు రెండో అవకాశం కష్టమే అంటున్నారు.

అటు మైలవరంలో వసంత కృష్ణప్రసాద్‌కు కూడా మళ్ళీ ఛాన్స్ వచ్చేలా కనిపించడం లేదు. ఈ సారి దేవినేని ఉమా టఫ్ ఫైట్ ఇచ్చేలా ఉన్నారు. ఇక నందిగామలో జగన్ మోహన్ రావు కాస్త పర్వాలేదనిపిస్తున్నారు....కానీ ఇక్కడ టి‌డి‌పి వేగంగా పుంజుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ జగన్‌కు కూడా కాస్త ఇబ్బందే అని చెప్పొచ్చు. కైకలూరులో దూలం పనితీరుకు కూడా పెద్దగా మంచి మార్కులు ఏమి పడటం లేదు. పైగా నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పితో జనసేన జట్టు కడితే దూలంకు నో సెకండ్ ఛాన్స్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: