బీజేపీ రాష్ట్ర సార‌థి సోము వీర్రాజు స‌హా.. ఆయ‌న అనుచ‌రులు.. బ‌ద్వేల్‌లోనే మ‌కాం వేశారు. మ‌రో 15 రోజుల్లో జ‌ర‌గ‌నున్న బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో గెలిచి తీరాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను కూడా ప‌క్క‌న  పెట్టి మ‌రీ బ‌ద్వేల్‌పై దృష్టి పెట్టారు. మంచిదే. అయితే.. ఇది వ్యూహ‌మా?  లేక‌.. గెలుస్తామ‌నే ధీమానా? అనేది బీజేపీ నేత‌ల‌కే అర్ధం కావ‌డం లేద‌ట‌. దీనికి కార‌ణం.. క‌డ‌ప జిల్లాలో కీల‌క నాయ‌కులు ఉన్నా.. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.

నిజానికి ఒక‌ప్పుడు.. టీడీపీలో ఉన్న ఆదినారాయ‌ణ‌రెడ్డి, సీఎం ర‌మేష్‌.. వంటి కీల‌క నాయ‌కులు.. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్నారు. ఈ క్ర‌మంలో బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో వీరంతా క‌లిసి వ‌స్తార‌ని.. పార్టీని గెలిపిస్తార‌ని.. అంద‌రూ అనుకుంటున్నారు. అయితే.. కీల‌క నాయ‌కులు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. వాస్త‌వానికి వీరంతా.. యాక్టివ్ అయ్యే ఆలోచ‌న‌లో ఉండ‌గా.. అనూహ్యంగా కేంద్రానికి చెందిన సునీల్ దేవ్‌ధ‌ర్‌.. టీడీపీ నుంచి వ‌చ్చిన వీరిపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

టీడీపీ నేత‌ల కు బీజేపీ పున‌రావాస కేంద్రంగా మారిందంటూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌చ్చితంగా బ‌ద్వేల్ ఉప ఎన్నికల స‌మ‌యంలో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఒక్క‌సారిగా టీడీపీ నేత‌లు దూర‌మ‌య్యారు. అంతేకాదు.. ఈ వ్యాఖ్య‌ల‌పై విష‌యం తేలే వ‌ర‌కు.. తాము పార్టీ త‌ర‌ఫున ప‌నిచేసేది లేద‌ని.. వారు బ‌హిరంగంగానే వ్యాఖ్య‌లు చేశారు. వాస్త‌వానికి త‌మ‌ను పార్టీలో చేర్చుకునేందుకు .. వెనుకాడ‌ని.. నేతలు.. ఇలా వ్యాఖ్యానించ‌డంపై టీడీపీ మాజీ నేత‌లు.. ఆగ్ర‌హంతో ఉన్నారు.

మ‌రోవైపు.. బ‌ద్వేల్ ఉప పోరులో పొత్తు పార్టీ జ‌న‌సేన వ‌దిలేసినా.. త‌గుదున‌మ్మా.. అంటూ.. బీజేపీ రంగంలోకి దిగింది. దీంతో జ‌న‌సేన నుంచి మ‌ద్ద‌తు క‌రువైంది. సో.. ఆ పార్టీ యువ నాయ‌కులు ఎవ‌రూ కూడా ముందుకు రావ‌డం లేదు. కేవ‌లం.. సోము వీర్రాజు హ‌డావుడి త‌ప్ప‌.. ఇక్క‌డ మ‌రెవ‌రూ క‌నిపించ‌డం లేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిజానికి ఇది.. వైసీపీ సీటు. వెంక‌ట సుబ్బ‌య్య మ‌ర‌ణంతో ఇక్క‌డ  ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ఆయ‌న స‌తీమ‌ణి సుధానే ఇక్క‌డ పోటీ చేస్తుండ‌డంతో సింప‌తీ ప‌వ‌నాలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి.

ఈ ప‌రిణామం నేప‌థ్యంలో బీజేపీ పోటీ చేయ‌డం. సోము వీర్రాజు కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని ఇక్క‌డ ప్ర‌చారం చేయ‌డం.. మ‌రోవైపు కీల‌క నేత‌లు.. ప్ర‌చారానికి దూరంగా ఉండ‌డం వంటి ప‌రిణామాలు క‌మ‌లం పార్టీ క‌ల‌క‌లానికి దారితీస్తున్నాయి. అస‌లు ఏం జ‌రుగుతోంది?  సోము వ్యూహం ఏంటి? అనే ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నా యి. అంతేకాదు.. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మేన‌ని తెలిసి కూడా పోటీ చేయ‌డం వెనుక ఉద్దేశం ఏంట‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. మ‌రి దీనికి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP