సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా కేవలం క్షణాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నాం. ప్రపంచంలో ఎక్కడో మారుమూల జరిగిన ఘటనలు నిమిషాల వ్యవధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలి పోతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రవిచిత్రమైన ఘటనలు కూడా ఈ మధ్య కాలంలో ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలు డెలివరీ అయిన సమయంలో పుట్టే శిశువు ఎంత బరువు తో పుడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా మూడు కిలోల బరువుతో పుడితే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది అని చెబుతారు డాక్టర్లు.



 మహా అయితే మూడున్నర కిలోల వరకు శిశువు జన్మించడం లాంటివి కూడా చూస్తూ ఉంటాము ఇక మూడు కిలోల కంటే తక్కువగా ఉంటే శిశువు కాస్త వీక్ గా ఉంది అని చెబుతూ ఉంటారు డాక్టర్లు. కానీ ఎప్పుడైనా ఆరు కిలోల శిశువు జన్మించడం గురించి విన్నారా.  ఇలాంటివి విన్నప్పుడు అందరూ ఆశ్చర్య పోక తప్పదు.  ఇలాంటి వార్త ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇది చదివిన వారు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు అనే చెప్పాలి. ఓ మహిళ ఏకంగా ఆరు కిలోల శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన చూసి డెలివరీ చేసిన  డాక్టర్లే ఆశ్చర్యపోయారట.



 ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది అమెరికాకు చెందిన క్యారీ అనే మహిళ 6.3 కిలోల బాలుడికి జన్మనిచ్చింది. ఇక ఆ బుడ్డోడికి పిన్లి అనే పేరు కూడా పెట్టింది  అయితే రెండు సంవత్సరాల వ్యవధిలో ఏకంగా 17 సార్లు ఆ మహిళకు గర్భస్రావం అయ్యిందట. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా 6.3 కిలోల శిశువుకి మహిళా జన్మనిచ్చిందట. అయితే ఇలా ఎక్కువ బరువుతో శిశువు జన్మించడంతో  ఆ మహిళకు డెలివరీ చేసిన వైద్యులు సైతం ఆశ్చర్య పోయారట. క్యారీ వ్యక్తిగత డాక్టర్ తన 30 ఏళ్ల కెరీర్లో అంత బరువైన శిశువుని ఎప్పుడూ చూడలేదు అంటూ సమాధానం చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇక అప్పుడే పుట్టిన శిశువుకు డ్రెస్ వేయడానికి ఏకంగా తొమ్మిది నెలల బాలుడు కి సరిపోయే డ్రెస్ కొనుక్కుని రావాల్సి వచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: