త‌మిళ‌నాడులో ఓ మాజీ మంత్రి ఇంట్లో ఏసీబీ అధికారులు చేప‌ట్టిన దాడులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. అన్నాడీఎంకే కీల‌క నేత‌, మాజీ మంత్రి విజ‌య్‌భాస్క‌ర్ నివాసంలో ఏసీబీ అధికారులు ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. చెన్నై, పుదుకొట్టేతో పాటు మొత్తం 43 చోట్ల ఈ సోదాలు చేప‌డుతున్నారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్న స‌మ‌యంలో వైద్యారోగ్య‌శాఖ మంత్రిగా విజ‌య‌భాస్క‌ర్ విధులు నిర్వ‌హించారు. ఆరోగ్య‌శాఖ‌లో క‌రోనా సంబ‌వించిన వేళ‌లో చాలా అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో  ఏసీబీ అధికారుల దాడులు కొన‌సాగుతున్నాయి.  మ‌రోవైపు అత‌ని హ‌యాంలో గుట్కాస్కామ్ భారీగా జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

విజ‌య్‌భాస్క‌ర్‌తో పాటు అత‌ని భార్య పేరుపై ఉన్న బ్యాంకులు, ఆభ‌ర‌ణాలు, వెహికిల్స్‌, వ్య‌వ‌సాయ భూములు, ఇంటిస్థ‌లాలు, బీమా పాల‌సీలు త‌దిత‌ర పెట్టుబ‌డులు, డిపాజిట్‌ల రూపంలో డ‌బ్బు వ‌న‌రుల‌ను, ఆస్తులున్నాయి. 2021 మార్చి 31 వ‌ర‌కు రూ.57.77 కోట్లు డిపెంటడెంట్లు ఉన్న‌ట్టు ఎఫ్ఐఆర్ (ఫ‌స్ట్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ రిపోర్టు)  పేర్కొన్న‌ది.  ఆదాయ‌ప‌న్ను రిట‌ర్న్‌లు, ఎన్నిక‌ల అఫిడ‌విట్‌ల‌లో పేర్కొన్న‌ట్టు చెక్ వ్య‌వ‌ధిలో రూ.58.64 కోట్లు చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ఆదాయ వ‌న‌రుల‌ను పొందినారు. అందులో విజ‌య్ భాస్క‌ర్‌, అత‌ని భార్య ర‌మ్య‌లు క‌లిసి రూ.34.51 ఖ‌ర్చు చేసారు. ఇద్ద‌రు రూ.51.35 కోట్ల వ‌ర‌కు పెన‌స‌రీ వ‌న‌రులు, ఆస్తుల‌ను సైతం సంపాదించారు. పొదుపు, ఖ‌ర్చులు, ఆదాయాన్ని లెక్కించిన త‌రువాత డీవీఏసీ త‌న  ఆదాయాన్ని రూ.27.22 కోట్లు ఉన్న‌ద‌ని  అధికారులు అంచెనా వేశారు.

 
అదేవిధంగా రాశి బ్లూ మెట‌ల్స్‌, గ్రీన్‌లాండ్ హైటెక్ ప్ర‌మోట‌ర్స్‌, ఓంశ్రీ వారి స్టోన్స్ లిమిటెడ్, రాశి ఎంట‌ర్‌ప్రైజెస్‌, అన్య ఎంట‌ర్‌ప్రైజెస్ వంటి వ్యాపార సంస్థ‌ల పేరుమీద ఉన్న ఆస్తుల‌ను సంపాదించార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇన్‌ఫాస్ట్ర‌క్ష‌ర్‌, సాయి హృద‌యం ఇన్‌ఫ్రా ప్ర‌యివేటు లిమిటెడ్ చెక్ వ్య‌వ‌ధిలో అత‌ని కుటుంబ స‌భ్యులు వాటాదారులు, య‌జ‌మానులుగా ఉన్నారు. త‌మిళ‌నాడులో స్టాలిన్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎంఆర్ విజ‌య్‌భాస్క‌ర్‌,  ఎస్పీ వేలుమ‌ణి,  కే సీ వీర‌మ‌ణి, డీవీఏసీ స్కాన‌ర్ కిందికి వ‌చ్చిన నాలుగో మాజీ మంత్రి సీ విజ‌య‌భాస్క‌ర్ కావ‌డం మ‌రొక విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: