ఎస్ ఇప్పుడు ఇదే విష‌యం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని గ‌త యేడాదిన్న‌ర కాలంగా టీడీపీ లో ఉన్నా కూడా తీవ్ర అసంతృప్తి తో ఉంటున్నారు. ప‌దే ప‌దే చంద్ర‌బాబును ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక నాని ఒంటెద్దు పోక‌డ‌ల‌తో విసిగి పోతోన్న ఆ పార్టీ న‌గ‌ర నేత‌లు సైతం బ‌య‌ట‌కు వ‌చ్చి ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ బ‌హిరంగంగానే నానిపై విమ‌ర్శ‌లు చేశారు. చివ‌ర‌కు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో మేయ‌ర్ అభ్య‌ర్ధిగా నాని కుమార్తె శ్వేత‌ను ప్ర‌క‌టించారు. ఈ విష‌యంపై కూడా పార్టీ నేత‌లు భిన్న స్వ‌రాలు వినిపించారు.

చివ‌ర‌కు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాతో పాటు బుద్ధా వెంక‌న్న‌, షేక్ నాగుల్ మీరా లాంటి వాళ్లు నాని ని టార్గెట్ గా చేసుకుని పెట్ట‌ని ప్రెస్ మీట్ కూడా కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌లో టీడీపీ చేజేతులా ఓడిపోయందుకు కార‌ణ‌మైంది. ఇక కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కొంతకాలంగా టిడిపి కార్యకలాపాలకు దూరంగా ఉంటోన్న కేసినేని నాని ఇప్పుడు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారంటూ ఒక్క‌సారిగా వార్త‌లు గుప్పుమంటున్నాయి. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిల నియామకం పై నాని అసంతృప్తి తో ఉన్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక ఇటీవ‌ల చంద్రబాబు నివాసం పై దాడి జరిగిన సమయంలో కూడా నాని దానిని ఖండించ లేదు. ఇక తాజాగా కేశినేని భవన్ లో చంద్రబాబు ఫోటోల తో పాటు ఆయ‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్ చార్జ్‌ల ఫొటోలు తొల‌గించ‌డంతో ఆయ‌న పార్టీ మారిపోతున్నార‌న్న వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరు న‌ట్ల‌య్యింది.

ఇక ఈ రోజు కేశినేని భవన్ లో ఎంపీ నాని వర్గీయులు సమావేశం అవ్వ‌డంతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చ‌ర్చిస్తున్నారు. ఆయ‌న పార్టీ మార‌ర‌ని ఆయ‌న అనునూయులు చెపుతున్నా.. ఆయ‌న బీజేపీలోకి వెళ్లి విశాఖ‌ప‌ట్నం నుంచి ఆ పార్టీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేస్తార‌న్న పుకార్లు గుప్పుమంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: