విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీ మారిపోతున్నారంటూ నిన్న‌టి నుంచి ప్ర‌ధాన మీడియాతో పాటు అటు సోష‌ల్ మీడియాలో ఒక్క‌టే వార్త‌లు గుప్పు మంటున్నాయి. నిజానికి నాని 2014 ఎన్నిక‌ల్లో ఎంపీ గా గెలిచిన‌ప్ప‌టి నుంచి టాటా ట్ర‌స్ట్ ద్వారా త‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. నానికి పార్టీ ఇమేజ్ మాత్ర‌మే కాకుండా కొంత సొంత ఇమేజే ఉంది. అందుకే గ‌త ఎన్నిక‌ల‌లో ఏపీలో టీడీపీ చిత్తు గా ఓడిపోయినా కూడా ఆయ‌న విజ‌య‌వాడ నుంచి ఎంపీగా రెండో సారి విజ‌యం సాధించారు. పైగా ఆయ‌న పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఆరుగురు టీడీపీ అభ్య‌ర్థులు ఓడిపోయి తూర్పు నియోజ‌క‌వ‌ర్గం లో ఒక్క గ‌ద్దె రామ్మోహ‌న్ మాత్ర‌మే గెలిచినా కూడా నాని ఎంపీ గా గెలిచారు. దీనిని బ‌ట్టే ఆయ‌న ప‌ర్స‌న‌ల్ ఇమేజ్ ఎంత‌లా వ‌ర్క‌వుట్ అయ్యిందో అర్థ‌మ‌వుతోంది.

ఇక నాని పార్టీ మారిపోతారంటూ ఓ వైపు వార్త‌లు వ‌స్తుంటే ఈ రోజు కేశినేని భ‌వ‌న్‌లో నాని అనుచ‌రులు, అనునూయులు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నాని వ‌ర్గానికి చెందిన మైనార్టీ నాయ‌కుడు ఫతావుల్లా మాట్లాడుతూ నాని పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాము కేశినేని భవన్ లో చంద్రబాబు ఫ్లెక్స్ లు తొలగించలేదు అని.. అయితే కేశినేని భవన్ లో ఒక చోట రతన్ టాటా తో నాని ఉన్న ఫోటో మాత్రమే ఏర్పాటు చేసామ‌ని క్లారిటీ ఇచ్చారు.

కేశినేని భవన్ చుట్టూ చంద్రబాబు, నేతల ఫ్లెక్స్ లు అలాగే ఉన్నాయ‌ని.. త‌మ పార్ల‌మెంటు ప‌రిధిలో టాటా ట్రస్ట్ సేవల గుర్తింపు గానే లోపల ఒక ఫోటో ఏర్పాటు చేశామ‌ని క్లారిటీ ఇచ్చారు. ఇక నాని పార్టీ లు మారతారు అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని. మునిగి పోయే పడవ లో కి ఎవరన్నా వెళ్తారా ? అంటూ ఆయ‌న మండి ప‌డ్డారు. ఇక పార్లమెంట్ కమిటీ మీటింగ్ ల కోసం ఎంపీ నాని ఢిల్లీ వెళ్లార‌ని.. నాని ప్ర‌తి సారి పార్టీ మార‌తారంటూ కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారంటూ ఫ‌తావుల్లా తో పాటు అక్క‌డ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: