ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ల‌ఖింపూర్ ఖేరీలో చోటుచేసుకున్న‌ హింసాత్మ‌క‌ ఘ‌ట‌న‌పై దేశవ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు నిర్వ‌హిస్తున్న నిర‌స‌న‌ ర్యాలీలో ఉన్న రైతుల‌పైకి కేంద్ర‌మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు అశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని కారు దూసుకుపోవ‌డంతో న‌లుగురు రైతులు మ‌ర‌ణించారు. అలాగే చాలా మంది గాయాల‌పాల‌య్యారు. ఆ త‌రువాత జ‌రిగిన సంఘ‌ట‌న‌లో మ‌రో ఐదుగురు చ‌నిపోయారు. దీంతో ల‌ఖింపూర్‌ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌తిప‌క్షాలు రైతు సంఘాలు తీవ్ర ఆందోళ‌న‌లు చేస్తున్నారు.



  ఇప్ప‌టికే అశిశ్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న విష‌యం విధిత‌మే. అయితే, ఈ ఘ‌ట‌న‌పై రైతు సంఘాలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు తెలుపుతున్నాయి. ఆశిశ్ మిశ్రాతో పాటుగా కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి అజ‌య్ మిశ్రాపై కూడా చ‌ర్య‌లు చేప‌ట్టాలల‌ని  డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌పై ఆందోళ‌న‌లో భాగంగా నేడు దేశ‌వ్యాప్త రైల్‌రోకోకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ` రైల్‌రోకో ` జరుగుతుంద‌ని రైతు సంఘాలు తెలిపాయి.

 
   అక్టోబ‌ర్ 3న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖేరి ప్రాంతంలో కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా అక్క‌డి రైతులు శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కేంద్ర‌మంత్రి కొడుకు త‌న కాన్వాయ్‌లోని ఓ కారు రైతుల మీదుగా దూసుకువెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు రైతులు మృతి చెందారు. దీంతో ఈ దారుణంపై కేంద్ర‌ప్ర‌భుత్వంతో పాటు యూపి యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త మొద‌ల‌యింది. ఇదే అద‌నుగా ప్ర‌తిప‌క్ష పార్టీలు బీజేపీ ప్ర‌భుత్వం పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అలాగే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ల‌ఖీంపూర్ ఖేరి బాధిత కుటుంబాలను ప‌రామ‌ర్శించారు. మ‌రోవైపు అక్టోబర్ 12 న  సంయుక్త కిసాన్ మోర్చా రైతుల మ‌రణాన్ని స్మ‌రించుకునేందుకు నిర్వ‌హించిన‌ ప్రార్థన సమావేశానికి కూడా ప్రియాంక హాజ‌ర‌య్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: