మోడీ ఎటువైపు ఉంటారో అన్న‌ది సందిగ్ధంగా ఉంది. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ఎదుర్కొనే స‌త్తా వైసీపీకి ఉంద‌ని అంటున్నారు జ‌గ‌న్. బాగుంది ఆయ‌న‌కు మోడీ తెర‌వెనుక ఉండి శ‌క్తి ఇస్తున్నాడ‌ని టీడీపీ అంటోంది. అదే స‌మ‌యంలో బీజేపీతో పాత స్నేహాల పునరుద్ధ‌ర‌ణ‌కు ప్రయ‌త్నాలు చేస్తోంది.


వ‌చ్చే ఎన్నిక‌ల్లో నువ్వా నేనా అన్న విధంగా  సాగే యుద్ధంలో మోడీ మ‌ద్ద‌తు ఎవ‌రికి అన్న‌ది ఇప్ప‌టికీ తేల‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రోక్షంగా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిచ్చారు. ఇంకా చెప్పాలంటే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే మోడీ మ‌ద్ద‌తు కోరుకున్నారు కూడా! అనుకున్న విధం గా విజ‌యం సాధించారు. అనుకున్న దాని క‌న్నా ఎక్కువ సీట్లే అందుకుని చిర కాల ప్ర‌త్య‌ర్థి బాబును ఓడించారు. చిత్తు చిత్తుగా ఓ డించాక, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 151 స్థానాల‌ను కైవ‌సం చేసుకుని ప్ర‌జాశీర్వాదం, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌న‌కు ఉంద‌ని చెప్పారు. అదేవిధంగా కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు వ‌స్తామంటే కూడా వ‌ద్ద‌నే చెప్పారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ లాంటి ఎమ్మెల్యేలు మాత్రం ఇటుగా వ‌చ్చి చంద్ర‌బాబును తిట్టిపోశారు. వాసుప‌ల్లి గ‌ణేశ్ (విశాఖ ఎమ్మెల్యే) పార్టీ మార‌న‌ప్ప‌టికీ త‌న కుమారుడిని పంపి వైసీపీ అనుకూ ల రాజ‌కీయం చేస్తున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్ కు వ్యూహ‌క‌ర్త‌గా ఉన్నారు. క‌నుక వైసీపీ - కాంగ్రెస్  క‌లిసి ప‌నిచేసేందుకు ఎక్కువ అవ‌కాశాలే ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఒక‌వేళ అలా కాకుంటే బీజేపీతో జ‌గ‌న్ వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇక టీడీపీ విషయానికే వ‌స్తే 2014 నాటి బంధాన్ని రిపీట్ చేయాల‌ని చూస్తున్నారు. ప‌వ‌న్ ను కూడా క‌లుపుకుని పోవాల‌ని చూ స్తున్నారు. కానీ ప‌వ‌న్ మాత్రం బీజేపీతో పొత్తు వ‌ద్ద‌నే అంటున్నార‌ని స‌మాచారం. ఇవ‌న్నీ ఎలా ఉన్నా టీడీపీతో బీజేపీ వెళ్లినా లా భం చంద్ర‌బాబుకే క‌నుక ఒక‌టికి రెండు సార్లు ఆలోచించాల‌ని క‌మ‌ల‌నాథులు అనుకుంటున్నారు. గ‌తంలో కూడా పొత్తు కార‌ణంగా బ‌ల‌ప‌డింది టీడీపీనే కానీ బీజేపీ కాద‌ని, అందుకే ఒంట‌రిగా పోటీ చేసి సీట్లు రాకున్నా పెద్ద‌గా పోయేదేం లేద‌ని అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. టీడీపీతో పొత్తును సోము వీర్రాజు అంగీక‌రించినా అంగీక‌రించ‌కున్నా మోడీ మాత్రం చంద్ర‌బాబుతో వెళ్లాల‌నే అనుకుంటు న్నారని తెలుస్తోంది. ఇందుకు వెంకయ్య దౌత్యం ప‌నిచేస్తుంద‌ని కూడా స‌మాచారం. మ‌రోవైపు స‌రైన క్యాడ‌ర్ లేకుండా ఒంట‌రిగా ఎన్నిక‌లకు వెళ్లి ఏం సాధిస్తామ‌ని, 2019 ఎన్నిక‌ల్లోనూ వైసీపీతో పోకుండా ఒంట‌రిగా పోయి సాధించిందేమీ లేద‌ని ఇంకొంద‌రు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: