పెద్ద‌ల స‌భ‌కు కేసీఆర్ ఎలా పంపాలి.. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధం కాకుండా వెంట‌నే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయ‌డం ఎలా అనేది కేసీఆర్ ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, కౌశిక్ రెడ్డి కోసం కేసీఆర్ మ‌రో ఆయుధం ప్ర‌యోగించ‌నున్నాడ‌ట‌. అదే కౌశిక్‌లో ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుతుంద‌ని అంటున్నారు. అయితే, ఆ అస్త్రం వ‌ర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. హుజురాబాద్ ఉప ఎన్నిక పోటాపోటిగా సాగుతున్న నేప‌థ్యంలో అంద‌రి నోటా మెదులుతున్న అంశం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వి.

 
  కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వి ప్ర‌తిపాద‌న గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర పెండింగ్‌లో ఉండ‌డంతో ఈ అంశం మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. చెప్పాలంటే బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ప్ర‌చారంగా మారింద‌ని చెప్పొచ్చు. కేసీఆర్ న‌మ్మించి గొంతు కోస్తాడ‌ని, మోసం చేస్తాడ‌ని అదే విధంగా కౌశిక్ కూడా అంతేన‌ని ఈట‌ల రాజేంద‌ర్, రేవంత్ రెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అటు కౌశిక్‌రెడ్డికి ఏదో కీడు శంకిస్తోంద‌ని తెలుస్తోంది. దీంతో కేసీఆర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. హుజురాబాద్‌లో ఈట‌ల రాజేందర్‌ను ఓడించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో అనేక వ్యూహాలు, ప‌థ‌కాలు పెడుతున్నాడు సీఎం కేసీఆర్‌.


 కేసీఆర్ వాడుతున్న అస్త్రాల్లో కౌశిక్‌రెడ్డి ఒక‌డు. ఉప ఎన్నిక వేళ కౌశిక్‌ను కారెక్కించుకున్న టీఆర్ఎస్‌. స‌మాజ సేవ‌కుల కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్‌ను గ‌వ‌ర్న‌ర్‌కు ప్ర‌తిపాదించారు కేసీఆర్‌. అయితే, కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయ‌డంపై గ‌వ‌ర్న‌ర్ సుముఖంగా లేద‌ని తెలుస్తోంది. దీంతో పూర్తి విచార‌ణ చేసిన త‌రువాత ప‌ద‌వి ఇచ్చేందుకు ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారు. ఈ విష‌యంపై ఎటూ తేల‌క‌పోవ‌డంతో కేసీఆర్ ప్రెస్టీజ్ ఇష్యూగా మారిందంటున్నారు రాజ‌కీయ వ‌ర్గాలు.

 

దీంతో కౌశిక్‌ను ఎలాగైన ఎమ్మెల్సీ చేసేందుకు మ‌రో ఆయుధం తీస్తున్న‌ట్టు తెలుస్తోంది.  కౌశిక్‌రెడ్డి కోసం హైకోర్టును ఆశ్ర‌యించే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌హారాష్ట్ర‌లో గ‌తంలో ఇలాగే జ‌ర‌గ‌డంతో అదే సంఘ‌ట‌ను స్ఫూర్తిగా తీసుకుని కోర్టు మెట్లు ఎక్కాల‌ని కేసీఆర్ యోచిస్తున్నాడ‌ట‌. మ‌రి కౌశిక్ కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: