విజయవాడ పడమట దత్త నగర్ లోని శ్రీ గణపతి ఆశ్రమానికి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా దత్త పీఠం కు ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు ఉంది. అయితే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 35 దేశాలలో దత్త పీఠం శాఖలను ప్రారంభించారు. హిందూ సంప్రదాయం ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇక ఈ దత్తపీఠం ద్వారా పేదలకు అన్నదానం మెడికల్ క్యాంపు నిర్వహించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి. అయితే అటు విజయవాడలో ఉన్న సచ్చిదానంద ఆశ్రమం కి కూడా ఎంతగానో గుర్తింపు ఉంది. అయితే సీఎం జగన్ గతంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో ఎన్నికల్లో గెలిచారు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు



 ఇకపోతే ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ పడమట దత్త నగర్ లో ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం కి చేరుకున్నారు. ఇక ఈ క్రమంలోనే తొలుత ఆశ్రమంలో ఉన్న మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తో సీఎం జగన్ సమావేశం అయ్యారు. కొంత సేపటి వరకు మాట్లాడుకున్నారు వీరు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కు ఆశీస్సులు అందించారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి   ఇక సీఎం జగన్ తో సమావేశం అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి మీడియాతో మాట్లాడారు.



 సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు అంటూ సచ్చిదానంద స్వామి వ్యాఖ్యానించారు. ఇక జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అర్చకులు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారని సచ్చిదానంద స్వామి తెలిపారు. హిందూధర్మ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారంటూ సచ్చిదానంద స్వామి చెప్పుకొచ్చారు. ఇక ఇటీవలే సీఎం జగన్ తో జరిగిన సమావేశంలో ఆలయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను కోరాను అంటూ తెలిపారు సచ్చిదానంద స్వామి. వంశపారంపర్య అర్చకులను ఎక్కువగా కొనసాగించాలని అడగ్గా అందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్లు గణపతి సచ్చిదానంద స్వామి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: