బ్యాంక్ ఉద్యోగులందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే వివిధ పండుగల నేపథ్యంలో బ్యాంకులకు వరుసగా సెలవులు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే అటు ఆ వివిధ బ్యాంకుల కస్టమర్లు కూడా రాబోయే వారం రోజుల్లో బ్యాంకుకు వెళ్లే ఆలోచనలు ఉంటే ఇక ఈ బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడు వస్తున్నాయి అని తెలుసుకోవడం ఎంతో బెటర్. వచ్చే వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న పండుగ నేపథ్యంలో బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి. సాధారణంగా కొన్ని ప్రాంతాలలో కొన్ని పండుగలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇక ఆయా పండుగలకు ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించడం చేస్తూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే ఇక ఆయా ప్రాంతాలలో ఆయా పండుగలు సంబరాలు ఉండే ప్రాధాన్యతలకు అనుగుణంగా బ్యాంకులకు హాలిడేస్ ప్రకటించడం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక పండుగలు సంబరాలు సంబంధించిన హాలిడేస్ కి తోడు అటు సాధారణ సెలవులు ప్రాంతీయ సెలవులు కూడా వీటితో పాటు కలిసి రావడం గమనార్హం. ఈ క్రమంలోనే రాబోయే వారం రోజులలో వరుసగా బ్యాంకు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇది తెలియకుండా కస్టమర్లు ఎవరైనా బ్యాంకుకు వెళితే మాత్రం సమయం వృధా చేసుకున్నట్లే అవుతుంది.



అక్టోబర్‌ 18న కాటిబిహు పండగ కారణంగా అస్సాంలోని బ్యాంకులకు హాలిడే రావడం జరిగింది . అక్టోబర్‌ 19న ఈద్‌ - ఇ - మిలాద్‌ సందర్భంగా దేశంలోని ముఖ్యమైన నగరాల్లో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు బంద్ కాబోతున్నాయి . ఇక అక్టోబర్‌ 20వ తేదీన వాల్మీకి జయంతి సందర్భంగా అగర్తలా, కోల్‌కతా, సిమ్లా, చండీగఢ్‌, బెంగళూరులో బ్యాంకులకు హాలిడే రాబోతుంది . అక్టోబర్‌ 22వ తేదీన ఈద్‌ - ఇ - మిలాద్‌ - ఉల్‌ - నబీ పండగ నేపథ్యంలో జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు దినం గా ఉంది  . అక్టోబర్‌ 23వ తేదీ నాల్గవ శనివారం కావడంతో దేశ వ్యాప్తంగా బ్యాంకులకు ఎప్పటిలాగానే  సాధారణ సెలవు ఇచ్చారు . అక్టోబర్‌ 24న ఆదివారం ఎప్పటిలాగానే ఇది బ్యాంకు సెలవు కావడం గమనార్హం . అయితే ఇలా బ్యాంకులకు హాలిడేస్ వచ్చినప్పటికీ ఆన్లైన్ సేవలు ఏటీఎం సేవలు మాత్రం కొనసాగుతాయని bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: