రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌లో హుజురాబాద్‌, ఏపీలో బ‌ద్వేల్ లో ఈ నెల 30న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. బ‌ద్వేల్‌లో అధికార వైసీపీ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగ‌త నేత డా.వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణి సుధ పోటీలో ఉన్నారు. ఆమె గెలుపు ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇక టీడీపీ, జ‌నసేన ఈ ఎన్నిక‌ల పోటీ నుంచి త‌ప్పుకుంది. మ‌రోవైపు వైసీపీకి తామే పోటి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌, బీజేపీ బ‌ద్వేల్ బ‌రిలో నిలిచాయి. అయితే, కాంగ్రెస్‌-బీజేపీ గెల‌వ‌క‌పోయిన ఎవ‌రికి ఎక్కువ ఓట్లు వ‌స్తాయ‌నే విష‌యంపైన ఈ రెండు పార్టీలు పోటీ ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది.


  అయితే, బీజేపి కంటే తామే ఎక్కువ ఓట్లు తెచ్చ‌కుంటామంటుంది కాంగ్రెస్‌.. కాగా కాంగ్రెస్ అభ్య‌ర్థిగా మాజి ఎమ్మెల్యే క‌మ‌ల‌మ్మ పోటికి దిగారు. కాగా, కాంగ్రెస్ టీడీపీ ఓట్ల‌ను న‌మ్ముకోవ‌డం త‌మ ఓటు బ్యాంకును మొత్తం వైసీపీకి ఇచ్చి తెలుగు దేశం పార్టీ వెంట ప‌డ‌డం చిత్రంగా అనిపిస్తోంది. కానీ, ఇది కాంగ్రెస్‌కు త‌ప్ప‌ని ప‌రిస్థితిగా మారింది. టీడీపీ ఇక్క‌డ పోటీ చేయ‌క‌పోవ‌డంతో ఆ పార్టీ ఓట్లు ఎన్నో కొన్ని త‌మ‌వైపు మ‌ల్లుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఆ విధంగా టీడీపీతో లోపాయికారంగా మంత‌నాలు కూడా చేస్తున్నారు.


 నిజానికి ఇక్క‌డ స్ట్రాట‌జీక్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది ప‌లువురి వాద‌న. ఏపీలో కాంగ్రెస్‌ను ఎంతో కొంత పెంచితే దానికి క‌ష్టం, న‌ష్టం వైసీపీదే అనుకుంటున్నారు. దీంతో పాటు ఆ పార్టీ వైపునకు మ‌ళ్లిన ఓట్ల‌ను ఎంతో కొంత వెన‌క్కి తెచ్చుకోవ‌చ్చ‌ని భావిస్తున్నారు. దీంతో టీడీపీ వ్యూహం ప్ర‌కారం కాంగ్రెస్‌కు మ‌ద్ధ‌తు ఇస్తే పోయేది ఏమి లేదు పైగా అది చివ‌ర‌కు వైసీపికి దెబ్బ‌తీస్తుంది. దీంతో చివ‌రి నిమిషంలో టీడీపీ ఓట్లు కాంగ్రెస్ వైపు మ‌ళ్లుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు విశ్లేషకులు. మ‌రోవైపు రానున్న ఎన్నిక‌ల్లో టీడీపి-బీజేపీ క‌లవాలి చూస్తోంది. దీంతో బీజేపీకి మ‌ద్ధ‌తు ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో టీడీపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి టీడీపీ ఏ పార్టికి మ‌ద్ధ‌తు ఇస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: