త‌మిళ‌నాడులో వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన రికార్డు అన్నాడీఎంకే పార్టిదే. అయితే, అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య అనారోగ్యంతో మ‌ర‌ణించారు జ‌య‌ల‌లిత‌. అయితే, అమ్మ మ‌ర‌ణం త‌రువాత సీఎం సీటుపై కూర్చుందామ‌నుకున్న శ‌శిక‌ళ‌కు జైలు త‌ప్ప‌లేదు. నాట‌కీయ రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే త‌మిళ‌నాడులో ఎట్ట‌కేల‌కు జైలు జీవితాన్ని పూర్తి చేసుకుని తిరిగి వ‌చ్చిన శ‌శిక‌ళ‌.. తిరిగి ప్ర‌జా జీవితంలోకి వ‌స్తున్న‌ట్టుగా సంకేతాలు పంపి స‌రిగ్గా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కాస్త ముందు త‌న‌కు రాజ‌కీయ లంటే ఆసక్తి లేద‌ని త‌ప్పుకోవ‌డం విశేషం.


  ప్ర‌స్తుతం తమిళ‌నాడులో స్టాలిన్ ముఖ్య‌మంత్రిగా డీఎంకే అధికారంలో ఉంది. ఇప్పుడు ఆయ‌న కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటిన  అత‌ను భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లో స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు వీలుగా శిక్ష‌ణ‌ను పొందుతున్నారు. కాగా, అన్నాడీఎంకే విషయానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆ పార్టీకి అవ‌స‌ర‌మైన బ‌ల‌మైన ముఖం క‌నిపించ‌డం లేదు. శ‌శిక‌ళ ఆ లోటును తీర్చాల‌ని త‌పిస్తున్నా. అందుకు అన్నాడీఎంకే నాయ‌క‌త్వం సుముఖంగా లేదు.


అమ్మ పోయిన సంద‌ర్భంలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రించిన శ‌శిక‌ళ మొద‌ట్లోనే అహంభావానికి పోవ‌డం. పార్టీ మొత్తాన్ని త‌న గుప్పిట్లో పెట్టుకోవ‌డం అని చూడ‌డంతో మొద‌టికే మోసం వ‌చ్చింది. ఇప్ప‌టికీ ఆమెకు పార్టీని అప్ప‌గించ‌డానికి ప‌న్నీరు, ప‌ల‌ని ఇద్ద‌రూ సుముఖంగా లేర‌ని తెలుస్తోంది. కానీ, శ‌శిక‌ళ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అందులో భాగంగానే పార్టీ పెట్టి 50 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా పార్టికి ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు శ‌శిక‌ళ‌. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లి నివాళుల‌ర్పించారు. పార్టీలో ఇప్పుడు ఉన్న శూన్య‌త కార‌ణంగా తానే స‌రైన వ్య‌క్తిగా భావిస్తున్నారు శ‌శిక‌ళ‌. మ‌రోవైపు జ‌నాక‌ర్ష‌ణ నేత కోసం అన్నాడీఎంకే చూస్తోంది. ఈ క్ర‌మంలో శ‌శిక‌ళ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: