మ‌న దేశంలో ఎప్పుడూ ఎదో ఒక అల‌జ‌డి సృష్టించాల‌ని ఉగ్ర వాదులు ప్ర‌య‌త్నం చూస్తు ఉంటారు. ఇప్ప‌టి కే మ‌న దేశం ఉగ్ర వాదుల నుంచి అనేక సార్లు దాడుల‌ను ఎదుర్కొంది. అలాగే మన దేశం లో ఉన్న ఇంటీలిజెన్స్ వ‌ర్గాలు ఇలాంటి దాడులు ముందు గానే ప‌సి గ‌ట్టి వాటిని జ‌ర‌గ‌కుండా చాలా వ‌రకు అడ్డు కున్నారు. అయితే మ‌ళ్లి మ‌న దేశం లో ఉగ్ర వాదులు దాడులు చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారా.. అంటే అవును అనే అంటున్నాయి ఇంటీలిజెన్స్ వ‌ర్గాలు. ఇప్ప‌టి కే ఐఎస్ఐ కొన్ని రాష్ట్ర ల‌ను ఎంచు కుని ఆయా రాష్ట్రాల‌ల్లో అల‌జ‌డి సృష్టిం చాల‌ని క‌ట్ర‌లు ప‌న్నుతున్నాయ‌ని ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు పోలీసులు ను హెచ్చ‌రిస్తున్నారు. దాడుల తో పాటు ముఖ్యంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌ మ‌త క‌లహాలు సృష్టించి ఐక్య మ‌త్యంగా ఉంటున్న ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెట్టాల‌ని ఐఎస్ఐ భావిస్తుంద‌ని అంచనా వేస్తున్నారు.



ఇలా ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌త క‌ల‌హాలు పెట్టించి హింస ను ప్రేరేపించాల‌ని ఆల్ ఖైదా తో క‌లిసి పాకిస్ధాన్ దేశానికి చెందిన ఐఎస్ఐ కుట్ర‌లు పన్ను తుంద‌ని ఇంటి లిజెన్స్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఐఎస్ఐ తో పాటు ఆల్ ఖైదా అనే సంస్థ‌లు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అసోం ను టార్గెట్ చేశారని తెలుస్తొంది. ఇటీవ‌ల అసొంలో ని గువాహ‌టీ న‌గ‌రంలో భారీగా మార‌ణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ మార‌ణాయుధాలు దీని కోస‌మే అసోం కు తీసు కువ‌చ్చార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అసోం రాష్ట్రంలో అక్టోబ‌ర్ 6 నుంచే ప‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేశామ‌ని ఆ రాష్ట్ర అడిష‌న‌ల్ డిజీపీ హిరెన్ నాథ్ తెలిపారు. అలాగే గ‌త కొన్ని రోజుల క్రితం క‌శ్మీర్ అంశంపై ఉగ్ర‌వాదుల విడుద‌ల చేసిన ఒక విడీయో లో కూడా అసొం గురించి మాట్లాడారు. దీంతో అసోం లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని ఇప్ప‌టికే రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు.






మరింత సమాచారం తెలుసుకోండి: