తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో చాలా రోజుల నుంచి ఉన్న మోత్కు ప‌ల్లి న‌ర్సింహులు చివ‌రికి నేడు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో గులాభి కండువ క‌ప్పు కొనున్నాడు. మోత్కు ప‌ల్లి న‌ర్సింహులు తెలుగు దేశం పార్టీ కి రాజీనామా చేసిన త‌రువాత బీజేపీ తీర్ధం పుచ్చు కున్నాడు. అయితే బీజేపీ లో ఆయ‌న కు స‌ము చిత స్థానం ఇవ్వ లేదంటు హ‌ర్ట్ అయ్యాడు. అలాగే ఈటల రాజేంద‌ర్ ను పార్టీలో చేర్చు కునే స‌మ‌యంలో త‌న‌ను క‌నీసం సంప్ర‌దించ లేద‌ని ప‌లు వేదిక ల‌పై కూడా చెప్పాడు. దీంతో అలాగే త‌న సీనియార్టీ ని గౌర‌విస్తూ మంచి ప‌ద‌వీ కూడా ఇవ్వ లేద‌ని కూడా చెప్పాడు. అందుకే తాను టీఆర్ఎస్ లో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. పార్టీ లో చేరిక అంశం పై కూడా ఆదివారం కేసీఆర్ తో భేటీ అయి చ‌ర్చించాడు.




అయితే సోమవారం రాష్ట్ర రాజ‌ధాని లో ఉన్న అంబేడ్క‌ర్, బాబు జగ్జీవ‌న్ రాం విగ్రాహ‌ల‌కు నివాళ్లు అర్పించి, అలాగే గ‌న్ పార్క్ వద్ద తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద అమ‌రుల‌ను స్మరించు కుని తెలంగాణ భ‌వ‌న్ కు చేరుకుని కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో గులాబీ తీర్థం పుచ్చు కోనున్నాడు. అయితే మోత్క ప‌ల్లి కి తెరాస లో ఎలాంటి గౌర‌వం ద‌క్క‌నుంద‌నే ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రినీ వేదిస్తుంది. త‌న‌కు సముచిత స్థానం ఇవ్వ‌లేద‌ని బీజేపీ కి రాజీనామా చేసిను అని ప్ర‌క‌టించిన మోత్కు ప‌ల్లి కి ఇప్పుడు టీఆర్ ఎస్ లో ఏ ప‌ద‌వి ద‌క్కుతుందో అనే ఆలోచ‌న అంద‌రి మెద‌డు ల‌లో వెలుగు తుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఒక నూత‌న ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది. అదే ద‌ళిత బందు. దీనిపై గ‌తంలో మోత్క‌ప‌ల్లి బ‌హిరంగం గానే కేసీఆర్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. దీని త‌ర్వాత ద‌ళిత బందు కు సంబంధించిన ప్ర‌తి స‌మావేశంలో మోత్కు ప‌ల్లి క‌నిపించాడు. అయితే ద‌ళిత బందు కు సంబంధించి ఆ ప‌థ‌కానికి చైర్మెన్ గా మోత్కు ప‌ల్లి న‌ర్సింహులు ను నియ‌మిచే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అంటున్నారు. అందు కోసమే పార్టీ లో చేర‌కి కాక ముందు నుంచి ద‌ళిత బందు స‌మావేశాల‌కు హాజ‌రు అవుతున్నారని అంటున్నారు. దీని పై క్లారీటి రావలంటే మ‌రి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.






మరింత సమాచారం తెలుసుకోండి: