భారత దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా తరువాత ఈ స్థితి మరింతగా మెరుగుపడిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఐఎంఎఫ్ సహా పలు సంస్థలు భారతదేశం రెండు ఏళ్లలో మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుందని, అభివృద్ధిలో కూడా ముందుంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో సంయమనంతో దానిని చక్కగా ఎదురుకొన్న తీరు ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇక పోటీగా ఉన్న చైనా ను కూడా కరోనా తరువాత ఎవరు నమ్మే స్థితిలో లేరు, దీనితో అందరి ద్రుష్టి భారత్ వైపు మళ్లింది. అందుకే పెట్టుబడులు కూడా భారీగానే వస్తాయని, మరో రెండేళ్లలో ఇదంతా జరిగిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఈ తరహా కార్యక్రమాలలో నిమగ్నం కాగా మరికొన్ని పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.

మొదటి నుండి భారత్ ఎవరి జోలికి పోకుండా తనదారిలో తాను ముందుకు అడుగులు వేసుకుంటూ పోతుంది. ఎవరు ఎన్ని దెబ్బలు కొట్టినా సహనంతో భరించింది. అప్పుడప్పుడు ప్రతిఘటించకపోతే శత్రువును నిలువరించడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని సార్లు భయపెట్టడం తప్పనిసరి అయ్యేది. అంతకు మించి శాంతి, సహనాన్ని ఎప్పుడు భారత్ విడువలేదు. సహనం పట్టుదల ఉంటె ఎంత గొప్ప స్థాయికైనా వెళ్ళవచ్చు అనే పెద్దల మాట, భారత్ విషయంలో నిజమవబోతుంది. భారత్ సహనం, ఇన్నాళ్లకు ఆ దేశాభివృద్ధికి అడుగులు వేయిస్తుంది. అంటే విదేశీ పెట్టుబడులు వస్తేనే అభివృద్ధి అనేమీ కాదు, కానీ స్వదేశీ సంస్థల కు ప్రభుత్వాలు వెన్నుదండుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నందున అన్ని విధాలా భారత్ కు రానున్న రోజులు ఆశాజనకమైనవే అంటున్నారు నిపుణులు.

భారతదేశానికి ఇప్పటివరకు వచ్చిన విదేశీ పెట్టుబడుల గణాంకాలు గమనిస్తే, గత ఏడేళ్లలో 127శాతం పెరిగాయి. మొత్తం ఈ పెట్టుబడుల విలువ 2013-14 లో 36.05 బిలియన్ డాలర్లుగా ఉంటె, 2014-15 లో 45.15 బిలియన్ డాలర్లు, 2015-16 లో 55.56 బిలియన్ డాలర్లు, 2016-17 లో 60.22 బిలియన్ డాలర్లు, 2017-18 లో 60.97 బిలియన్ డాలర్లు, 2018-19 లో 62 బిలియన్ డాలర్లు, 2019-20 లో 74.39 బిలియన్ డాలర్లు, 2020-21 లో 81.97 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: