ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప లోని బ‌ద్వేల్ ఉప ఎన్నిక ప్ర‌చారం ఏ మాత్రం హ‌డావిడి లేకుండా కొన‌సాగుతోంది. ఇక్క‌డ నుంచి గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించిన డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య ఇటీవ‌లే అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఇప్పుడు జ‌రుగుతోన్న ఉప ఎన్నిక ల‌లో వైసీపీ త‌మ పార్టీ నుంచి వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణి డాక్ట‌ర్ సుధ నే పోటీ లో పెట్టింది. ఇక చ‌నిపోయిన వ్య‌క్తి కుటుంబ స‌భ్యుల‌కే సీటు ఇవ్వ‌డంతో ఇక్క‌డ త‌మ అభ్య‌ర్థిని పోటీలో పెట్ట‌మ‌ని టీడీపీ పోటీ నుంచి త‌ప్పుకుంది. ఇక జ‌న‌సేన కూడా అదే బాట‌లో పోటీ పెట్ట‌లేదు.

అయితే జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ ఇక్క‌డ పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల‌లో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వ‌స్తాయ‌న్న దానిపై విచిత్ర‌మైన బెట్టింగ్ బ‌ద్వేల్లో ఇప్పుడు జ‌రుగుతోంది. స‌రే ఇదిలా ఉంటే ఇప్పుడు ఇక్క‌డ వైసీపీకి గెలుపు విష‌యంలో ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే బ‌ద్వేల్లో వార్ వ‌న్ సైడ్ అయిపోయింది. వైసీపీ తిరుగులేని విజ‌యం సాధించ‌నుంది.

అయితే ఇప్పుడు ప్ర‌ధాన పార్టీ ల నుంచి పోటీ లేక‌పోవ‌డంతో ఇక్క‌డ ల‌క్ష మెజార్టీ వ‌చ్చేలా చూడాల‌ని జ‌గ‌న్ క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటు రాయ‌చోటి ఎమ్మెల్యే, విప్ శ్రీకాంత్ రెడ్డికి టార్గెట్ పెట్టార‌ట‌. బ‌ద్వేల్ ఉప ఎన్నిక బాధ్య‌త‌ల‌ను జ‌గ‌న్ ప్ర‌ధానంగా ఈ ఇద్ద‌రి మీదే పెట్టారు. మ‌రి జ‌గ‌న్ సొంత జిల్లాలో వ‌చ్చే మెజార్టీ తో ఏపీ వ్యాప్తంగా త‌మ ప్ర‌భుత్వంపై వ్య‌తిర‌క‌త ఉంద‌ని వ‌స్తోన్న వార్త‌ల‌కు పూర్తి గా చెక్ పెట్టాలంటే ఇక్క‌డ వ‌చ్చే ఆ ల‌క్ష మెజార్టీ యే స‌మాధానం కావాలి. మ‌రి ఈ టార్గెట్ శ్రీకాంత్‌, అవినాష్ రీచ్ అవుతారో ?  లేదో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: