ఏపీ లో క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వంగా ఇక్క‌డ టీడీపీ పోటీలో ఉండి ఉంటే ఈ పాటికే బ‌ద్వేల్ పెద్ద ర‌ణ క్షేత్రంగా మారిపోయి ఉండేది. అయితే ఇక్క‌డ నుంచి గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌లో గెలిచిన ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య మ‌ర‌ణంతో ఆయ‌న భార్య‌కే అధికార వైసీపీ సీటు ఇవ్వ‌డంతో గ‌త సంప్ర‌దాయాల‌ను అనుస‌రించి ఇక్క‌డ టీడీపీ పోటీ పెట్ట‌లేదు. చంద్ర‌బాబు గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌లో ఓడిన ఓబులాపురం రాజ‌శేఖ‌ర్ పేరును ముందుగా ప్ర‌క‌టించాక సుధ అభ్య‌ర్థిత్వం ఖ‌రారు కావ‌డంతో తాము పోటీ నుంచి విర‌మించుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇక జ‌న‌సేన కూడా అదే సంప్ర‌దాయాన్ని అనుస‌రిస్తూ త‌మ అభ్య‌ర్థిని పోటీ పెట్ట‌లేదు. ఇక ఇప్పుడు అక్క‌డ రెండు జాతీయ పార్టీలు అయిన బీజేపీ తో పాటు కాంగ్రెస్ కూడా త‌మ అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దింపాయి. ఇక్క‌డ గెలుపు వైసీపీదే అన్న విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈ రెండు పార్టీల లో ఇక్క‌డ సెకండ్ ప్లేస్ లో ఎవ‌రు ఉంటార‌న్న దానిపై నే ఇప్పుడు ఇక్క‌డ బెట్టింగులు జ‌రుగుతుండ‌డం విశేషం.

ఈ రెండు పార్టీల లో ఎవ‌రికి అయినా డిపాజిట్ ద‌క్కుతుందా ?  బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వ‌స్తాయా ? ఈ కోణంలో ఇక్క‌డ బెట్టింగ్ లు న‌డుస్తున్నాయి. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఇక్క‌డ టీడీపీ సానుభూతి ప‌రులు కాంగ్రెస్ కు ఓట్లేసి.. బీజేపీకి ఏ పీలో ఎంత మాత్రం సీన్ లేద‌ని చెప్పేందుకు క‌సితో ఉన్నారు. ఇక జ‌న‌సేన ఓట్ల త‌మ‌కు ప‌డ‌తాయ‌ని బీజేపీ ఆశ‌ల‌తో ఉంది. మ‌రి టీడీపీ ,జ‌న‌సేన ఓట్లు నిజంగానే బీజేపీ, కాంగ్రెస్ కు ట‌ర్న్ అవుతాయా ? అన్న‌ది కూడా చూడాలి. ఏదేమైనా ఇక్క‌డ బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు వ‌స్తాయ‌న్న బెట్టింగ్‌లు ఎక్కువ న‌డుస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: