ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌కు త్వ‌ర‌లోనే ఓ పరీక్ష ఎదురు కానుంది. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో అధికార వైసీపీ ఎక్క‌డ చూసినా బంప‌ర్ మెజార్టీతో తిరుగులేని విజ‌యం సాధించింది. ఎక్క‌డిక‌క్క‌డ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు త‌మ త‌మ ప్రాంతాల్లో తిరుగులేని ఘ‌న విజ‌యాలు న‌మోదు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి మున్సిపాల్టీ మిన‌హా అన్ని చోట్లా వైసీపీ జెండా అప్ర‌తిహ‌తం గా ఎగిరింది. అయితే ఇప్పుడు మ‌రో సారి మినీ స‌మ‌రానికి తెర లేవ‌నుంది.

రాష్ట్రం మొత్తం మీద 9 జిల్లాల్లోని 12 స్థానాల్లో వివిధ కారణాలతో ఎన్నికలు జ‌ర‌గ‌లేదు. ఎన్నిక‌లు జ‌ర‌గ‌ని వాటిల్లో మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలు ఉన్నాయి. ప‌లు జిల్లాల్లోని 12 స్థానాలకు పొలింగ్ బ్రేక్ పడింది. ఈ మినీ ఎన్నిక‌ల స‌మ‌రం ఉత్తరాంధ్ర మినహా కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఉండ‌నుంది. న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ రిలీజ్ చేస్తుంద‌ని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇందులో మంత్రి అనిల్ కుమార్ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నెల్లూరు కార్పొరేషన్ తో పాటు క‌డ‌ప జిల్లాలోని కమలాపూరం - నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం  - గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి , కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటితో పాటు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా కొండపల్లి - ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి, చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పం - క‌డ‌ప జిల్లా బేతం చెర్ల , రాజంపేట , అనంత‌పురంలోని పెనుగొండ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ స్థానాల్లో కూడా పాగా వేసేందుకు వైసీపీ వాళ్లు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టేశారు. అయితే మంత్రి అనిల్ కూడా ఇప్పుడు నెల్లూరు కార్పోరేష‌న్ లో వైసీపీ ని గెలిపించి త‌న ప‌ట్టు నిలుపుకోవాల్సి ఉంది. అయితే ఈ ప‌రీక్ష‌లో మంత్రి అనిల్ పెద్ద క‌ష్ట‌ప‌డ‌కుండా గ‌ట్టెక్కే ఛాన్సులే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: