హుజురాబాద్ నియోజకవర్గంలో  జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ విజయం పై ధీమాగా ఉన్నాయి. ముఖ్యంగా బిజెపి,కాంగ్రెస్ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. టిఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బిజెపి నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ లు పోటీ పడుతున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో కి వచ్చేసరికి టిఆర్ఎస్,బిజెపిలు దూకుడుగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ఇంకా ఎన్నికల మూడ్ లోకి వచ్చినట్లుగా కనిపించడం లేదు. మరోవైపు చూస్తే పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేస్తుంది. అయినా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. ఇక ఈ ఎన్నిక వర్గంలో పరిస్థితి చూసుకుంటే ఈటల రాజేందర్ కు ఈ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉండడం, టిఆర్ఎస్ ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకత, రాజేందర్ పై ఉన్న సానుభూతి ఇవన్నీ బిజెపికి కలిసి వచ్చే అంశాలే. టిఆర్ఎస్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దళిత,సామాజిక వర్గ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అంతేకాకుండా ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలను రంగంలోకి దించి, ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేలా టిఆర్ఎస్  ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ రేసులో కాంగ్రెస్ మాత్రమే బాగా వెనుకబడి నట్లు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో బలమైన  నేతలను కాంగ్రెస్ పోటీలోకి దించుతుందని అంతా అనుకున్నా కాంగ్రెస్ మాత్రం బల్మూర్ వెంకట్ అనే విద్యార్థి నాయకుడిని పోటీకి దించింది. టిఆర్ఎస్ నుంచి విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పోటీగా కాంగ్రెస్ వెంకట్ ను దింపిన ప్రచారంలో మాత్రం బాగా వెనకబడి పోయింది. ఈ నియోజకవర్గంలో త్రిముఖపోటీ ఉందని అంతా అంచనా వేసిన ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బిజెపి, టిఆర్ఎస్ మధ్య పోటీ  ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: