దేశంలో గత కొద్ది రోజుల నుంచి పెట్రోల్ డిజిల్ గ్యాస్ ల పై ధ‌ర‌లు పెర‌గుతున్నాయి. దీంతో కేంద్రం లో ఉన్న బీజేపీ స‌ర్కార్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అలాగే ప్ర‌జ‌ల నుంచి కూడా బీజేపీ వ్య‌తిరేక గ‌ళం వినిపిస్తుంది. కొన్ని నెల‌ల్లోనే ఒక లీట‌ర్ పెట్రోల్ పై దాదాపు 15 రూపాయాలు పెరిగింది. అలాగే డిజిల్ కూడా 100 రూపాయాలు దాటింది. వీటి తో పాటు గ్యాస్ కూడా 14.2 కీలో గ్రాముల కు 1000 రూపాయాల‌కు చేరువ‌లో ఉంది. తాజాగా ఈ రోజు కూడా 14.2 కేజీ ల గ్యాస్ పై 15 రూపాయాలు పెరిగి 952 రూపాయాల‌కు చేరుకుంది. ఇలా ప్ర‌తి రోజు పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధ‌ర‌లు పెర‌గ‌డం తో బీజేపీ పై ప్ర‌జ‌లు తీవ్ర అసంతృస్తి తో ఉన్నారు. అయితే దీని ప్ర‌భావం మ‌న రాష్ట్రంలో హుజూరాబాద్ లో జ‌రుగుత‌న్న ఉప ఎన్నిక‌ల‌పై ప‌డుతుందా అనే అనుమానం రాష్ట్ర బీజేపీ నాయ‌క‌లు పై ప‌డుతుంది.




హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రచారం పాల్గొంటున్న మంత్రి హ‌రీష్ రావు త‌న దైన శైలి లో బీజేపీ పై విమ‌ర్శలు గుప్పిస్తున్నాడు. ముఖ్యంగా విప‌రీతంగా పెరుగుతున్న పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధ‌ర‌ల‌పై బీజేపీ ని టార్గేట్ చేస్తూ విమ‌ర్శ బాణాలు వ‌దులు తున్నారు. అంతే కాకుండా త‌న ప్ర‌చారంలో కూడా ఎల్ పీ జీ గ్యాస్ సిలీండ‌ర్ ను ప‌ట్టు కుని ప్ర‌జ‌ల‌కు ధ‌ర‌ల పెరుగుద‌ల గురించి వివ‌రిస్తున్నాడు. దీంతో హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌ల్లో కూడా బీజేపీ పై త‌ప్ప‌డు అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది. ఇది రాబోతున్న ఉప ఎన్నిక‌ల పై తీవ్ర ప్ర‌భావం చూసే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర బీజేపీ నాయ‌కులు అభిప్రాయ పడుతున్నారు. తాము నిర్వహించే ప్ర‌చారంలో ఈ ధ‌ర‌ల పెరుగుద‌ల అంశం పై ప్ర‌జ‌ల ప్రశ్నిస్తే తాము ఎలా స‌మాధానం చెప్పాల‌ని త‌ల‌లు ప‌ట్టు కుంటున్నార‌ని స‌మాచారం. పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధ‌ర‌లు పెర‌గడం సామ‌న్య ప్ర‌జ‌ల‌కే కాదు బీజేపీ కి కూడా క‌ష్టాల‌ను తెచ్చి పెడుతున్నాయ‌ని ప‌లువురు వ్యంగ్యం గా అంటున్నారు. ఎది ఏమైనా ధ‌ర‌లు పెరుగుద‌ల ఈ ఉప ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. అయితే ఈ ప్ర‌భావం అనేది ఏ మేర‌కు చూపుతుందో  చూడాలి మ‌రి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: