సాధారణంగానే ఏపీ రాజకీయాలు ఎప్పుడు వాడివేడిగానే జరుగుతూ ఉంటాయి. ఇక మరికొన్ని రోజుల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగ పోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మోగబోతుంది  దీంతో మరోసారి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటారు. దీంతో అటు ఏపీ రాజకీయం మొత్తం మరోసారి వేడెక్కపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 చోట్ల ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా ప్రస్తుతం అన్ని పార్టీల దృష్టి కూడా ఈ మున్సిపల్ ఎన్నికల పైనే ఉంది. కొన్ని కారణాలవల్ల మొన్న జరగకుండా ఆగిపోయిన మున్సిపాల్టీలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.



 ఈ క్రమంలోనే నెల్లూరు కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకి కూడా త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 23వ తేదీన తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి లో ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాకుండా గురజాల,దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీకి కు లకు కూడా ఎన్నికలు జరగబోతున్నట్లు తెలుస్తోంది . ఈ క్రమంలోనే ఇక అన్ని పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో గెలవాలని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వుండటం గమనార్హం.


 అయితే ఇటీవలే ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కసారిగా రాజకీయ వ్యూహాలు మొత్తం తెరమీదకు వచ్చాయి. అయితే 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచీ జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా వైసిపి భారీ మెజారిటీ సాధిస్తూ విజయఢంకా మోగిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు  ఎన్నికల్లో కూడా అదే మాదిరి సత్తా చాటాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది. అయితే గత ఎన్నికలలో తక్కువ స్థానాల్లో గెలిచి పరువు పోగొట్టుకున్న టిడిపి ఈసారి మాత్రం పరువు నిలబెట్టుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: