ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు పరిస్థితులను సమీక్షించారు సీఎం జగన్.  రాష్ట్రంలోకరెంటు పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి
బొగ్గు సరఫరా, విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాల పైనా సమగ్రంగా చర్చించారు.   అవాంతరాలు లేకుండా  కరెంటును సరఫరా చేస్తున్నట్లు సీఎంకు వివరించిన అధికారులు... మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి 2 ర్యాకులు బొగ్గు అదనంగా వచ్చిందని తెలిపారు.  రాష్ట్రంలో జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌విద్యుత్‌ ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచినట్లు తెలిపారు అధికారులు.


ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ..  థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని.. సింగరేణి సహా కోల్‌ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. బొగ్గు తెప్పించు కునేం దుకు  సరు కు రవా ణా షి ప్పుల విని యోగం లాంటి ప్రత్యా మ్నాయా లు ఆలో చించాలని.. దీని వల్ల రవా ణా ఖర్చు లు కలిసి వస్తా యని పేర్కొన్నారు సిఎం జగన్.  సంబం ధిత కేంద్ర ప్రభుత్వ విభాగాల తో సమన్వయం చేసు కోవాలని..పేర్కొ న్నారు సిఎం జగన్.  

పవర్‌ ట్రే డింగ్‌ కార్పొ రేషన్‌ నుంచి 170 మెగా వాట్ల విద్యుత్‌ కూడా అందుబాటు లోకి వస్తోం దని తెలిపారు అధి కారులు. కావాల్సిన విద్యుత్‌ ను సమీకరిం చుకోవాలని.. తాత్కాలిక చర్యల తో పాటు దీర్ఘ కాలిక విద్యుత్‌ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టి సారించాలని పేర్కొన్నారు సిఎం జగన్.  6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణం పై తగిన చర్యలు తీసుకోవాలని..  సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ ప్రాజెక్టులను సాకారం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని వెల్లడించారు సిఎం జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: