బూత్ వారీగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు తెలంగాణా బిజెపి నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ నిర్ణయం తీసుకున్నాయి అని వివరించారు. వందకోట్లకు దగ్గర్లో వ్యాక్సినేషన్ పక్రియ దానిని జాతీయ పండుగగా నిర్వహించుకోవాలి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. బడుగు బలహీన వర్గాలకు బిజెపి ప్రభుత్వంలో పెద్దపీట వేశారు అని అన్నారు. అన్ని వర్గాలకు చేయూతనిచ్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని చెప్పారు.

ఇన్ని సంవత్సరాలలో ఏ పార్టీ,  ఏ ప్రభుత్వం చేయలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నాం అన్నారు. ఓబీసీల సంక్షేమం కోసం ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది అని ఆయన వివరించారు. 27 శాతం రిజర్వేషన్లు వర్తించేలా కేంద్రం చర్యలు చేపట్టింది అన్న ఆయన ఓబీసీ మేళాలను ఢిల్లీ సహా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. ఈ నెల 22న ఓబీసీ మేధావుల సదస్సు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మేము గెలుస్తాము అని ధీమా వ్యక్తం హేసారు.

హుజురాబాద్ ఎన్నికల్లో కూడా బిజెపి గేలుస్తుంది.. మెజారిటీ అటు ఇటు ఉండవచ్చు అని అన్నారు. రాష్ట్ర మంత్రులు ఈ ఎన్నిక చిన్నది అంటూనే భయపడుతున్నారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బిజెపి పార్టీ బలపడుతోంది... టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి అని లక్ష్మణ్ జాతీయ భారతీయ జనతా పార్టీ ఓ బి సి మోర్చా అధ్యక్షుడు అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా, గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాము అని ఆయన వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయి అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి ఏడు సంవత్సరాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము అన్నారు. 175 కేంద్ర పథకాలు అమలులో ఉన్నాయి వాటిని ప్రజల్లోకి తీసుకు పోవాలనీ నిర్ణయం తీసుకున్నాం అన్నారు ఆయన. కరోనా వ్యాక్సినేషన్ ఉచితంగా వేస్తున్నాం.. 100 కోట్ల దగ్గరలో ఉన్నాము అనో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp