సాగునీటి రంగాన్ని జగన్ రెడ్డి అజ్ఞానంతో నిర్వీర్యం చేస్తున్నారు అన్నారు ఏపీ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు. పోలవరం, నదుల అనుసంధానాన్ని కమిషన్ల కోసం అస్తవ్యస్తం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు లోపల మరో ఎత్తిపోతల పథకం అంటున్నారు అని జగన్ పాలనలో నిర్వీర్యమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పిలుపునిచ్చారు చంద్రబాబు. వైసీపీ పాలనలో ప్రజలకు అప్పులు.. జగన్ బినామీలకు ఆస్తులు అని అన్నారు. రాంకీ, హెటిరో సహా బినామీ కంపెనీల్లో వేల కోట్ల బ్లాక్ మనీ అని ఆయన తెలిపారు.

రెమిడెసివర్ బ్లాక్ మార్కెట్లో బ్లాక్ మనీ హెటిరోలో బయటపడింది అని ఆయన తెలిపారు. విశాఖ ఏజెన్సీలో నల్గొండ పోలీసుల అరెస్టు చేస్తే ఏపీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది అని ఆయన నిలదీశారు. విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీలో 25 వేల ఎకరాల్లో రూ.8వేల కోట్ల విలువైన గంజాయి  దొరికిందని చిత్తూరు, అనంతపురంలో ఓపియం సాగు చేస్తున్నారు అని అన్నారు. డ్రగ్స్, కల్తీ లిక్కర్ వలన జాతి నిర్వీర్యం అవుతోంది అన్నారు. గంజాయి, హెరాయిన్ స్మగ్లర్లే రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్నారు అంటూ ఆరోపించారు.

పాడేరు ఏజెన్సీలో లిక్విడ్ గంజాయి, ఐస్ క్రీం, చాక్లెట్ల తయారీ జరుగుతుందని తెలిపారు. రెండున్నరేళ్లలో విద్యుత్ వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం  మోపారని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం చేసారని అన్నారు. ప్రజా రక్షఖ పోలీసు వ్యవస్థ ప్రజా భక్షక వ్యవస్థగా మారింది అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రైవేటు కేసులు వేస్తాం అని తెలిపారు చంద్రబాబు. ఇంద్రకీలాద్రి, తిరుమలలో అన్యమత ప్రచారం దుర్మార్గం అన్నారు ఆయన. విమానాల్లో వాడే ఫ్యూయల్ కంటే.. పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ అన్నారు ఆయన. ఆరు దశల్లో పరిశీలన పేరుతో పెన్షన్, రేషన్ కార్డులు కోత అని చంద్రబాబు ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: