పొత్తులు ఖ‌రారు కాక‌పోయినా ప్రేమ ఖ‌రారు అయింది. పొత్తుల నిర్ణ‌యం ఏం లేక‌పోయినా ప్రేమకు సంబంధించిన స‌మీక‌ర‌ణాలు అన్నీ కుదిరాయి. ఈ సారి ఆంధ్రావ‌నికి ఆర్థిక న‌ష్టం ఉన్నా లేకున్నా పార్టీల మ‌ధ్య బంధాలు మాత్రం మ‌రింత బ‌లోపేతం అవుతాయి. ఈ క్ర‌మంలో కొత్త‌, పాత‌ల క‌ల‌యిక ఏమ‌యినా ఉంటే ఉండాలి?


ఎప్ప‌టి నుంచో వైసీపీ,బీజేపీ బంధం ఒక‌టి మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంది. అదేవిధంగా జ‌గ‌న్ పార్టీ ఎంపీలు కూడా కేంద్రానికి అనుకూలంగానే ఉన్నారు. ముఖ్యంగా వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలో కూడా మోడీ చెప్పిందే వేదం అని అంగీక‌రించారు కూడా! ఇవ‌న్నీ ఎలా ఉన్నా సాయి రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఎంపీలంతా బీజేపీతో స‌ఖ్య‌త న‌డుపుతూనే ఉన్నారు. అంతేకాదు చంద్ర‌బాబు తో స్నేహం చేయ‌డం బీజేపీకి ఇష్టం లేదు కనుక సంబంధిత బంధాలు తెగిపోయాయ‌ని తేలిపోయింది. దీంతో సీన్లో కి వైసీపీ పెద్ద‌లు వ‌చ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాల‌ని యోచిస్తున్నారు.  

మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా జ‌గ‌న్ స‌హ‌కారం పొందాల‌నే మోడీ భావిస్తున్నారు. ఎన్నిక‌ల్లో నేరుగా మద్ద‌తు పొందినా, పొంద‌కున్నా, ఎన్నిక‌ల త‌రువాత అయినా ఇప్ప‌టిలానే ఆయ‌న నుంచి కాస్తయిన మ‌ద్ద‌తు ఉంటే బాగుంటుంది అని కూడా అను కుంటు న్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని మోడీతో త్వ‌ర‌లోనే జ‌గ‌న్ భేటీ అయి అన్ని వివ‌రాలూ వివ‌రించి రానున్నారు. అంతేకాదు రా ష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై కూడా మాట్లాడి వ‌స్తారు. ఈ త‌రుణంలో పొత్తుల విష‌య‌మై బీజేపీ పెద్ద‌ల‌తో మాట్లాడి ఓ క్లారిఫికేష‌న్ కూడా తీసుకోనున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఒంటరిగానే పోరాటం చేసిన జ‌గ‌న్ ఈ సారి కూడా అదే పంథాలో ఉంటారు. ఎన్నిక‌లు అ య్యాక కేంద్రంలో ఉండే ప్ర‌భుత్వంతో ఏ విధంగా న‌డుచుకోవాలో అన్న‌ది నిర్ణ‌యిస్తారు. ఇదే క్ర‌మంలో ప‌ద‌వులు అడ‌గ‌కుండా రాష్ట్రా నికి నిధులు ఇవ్వ‌మ‌ని మాత్ర‌మే చెబుతారు అని అంటున్నారు కొందరు వైసీపీ పెద్ద‌లు. ఏదేమైన‌ప్ప‌టికీ రానున్న ఎన్నిక‌ల్లో బీజే పీ, వైసీపీ క‌లిసి ప‌నిచేసినా చేయ‌కున్నా ఒక పార్టీకి మ‌రో పార్టీ శ‌త్రువు అయితే కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: