ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం మున్సిపాలిటీ ప్రాంతంలో ఇవాళ మరియు రేపు అంటే 18 మరియు 19వ తారీకుల్లో వైన్స్ దుకాణాలు మూసివేయనున్నారు అధికారులు. ఈ రెండు రోజులు పాటు మద్యం దుకాణాలను పూర్తిగా క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆ జిల్లా కలెక్టర్ అండ్ ఎక్సైజ్ అధికారులు. అదేంటి ఉన్నట్టుండి రెండురోజులపాటు లిక్కర్ షాపులు బంద్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును... ఇది నిజమే. ఇవాళ మరియు రేపు అంటే 18 మరియు 19వ తేదీలలో ఉత్తరాంధ్రలో ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు జరగనున్న సంగతి మనందరికీ విధితమే. 18వ తేదీన అంటే ఈ రోజున తేలోల్ల ఉత్సవం నిర్వహిస్తుండగా 19వ తారీకు అంటే రేపు సిరిమానోత్సవం జరుగనుంది. ఈ రెండు రోజుల కార్యక్రమాల నేపథ్యంలో జిల్లా పోలీసులు మరియు ఉన్నత అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. 

ఇక పైడితల్లి అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో... ఇవాళ మరియు రేపు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో ఉన్నటువంటి వైన్స్ షాప్ లను మరియు  బార్లు మరియు రెస్టారెంట్లు... పూర్తిగా మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నారు జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి. ఈ మేరకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు విజయనగరం కలెక్టర్ ఏ సూర్యకుమారి. అంతేకాదు ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్ ఏ సూర్యకుమారి.

ఉత్సవాలు రెండు రోజులు జరుగుతున్న నేపథ్యంలో నగరంలోని మద్యం దుకాణాలు మరియు బార్లు మరియు కల్లు దుకాణాలు పూర్తిగా మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాల నేపథ్యంలో చాలా గొడవలు జరిగే ప్రమాదం పొంచి ఉందని.. ఇలాంటి నేపథ్యంలో శాంతిభద్రతలు చాలా ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ఏ మద్యం దుకాణాలను మూసివేసి ఉన్నట్లు స్పష్టం చేశారు కలెక్టర్ ఏ సూర్యకుమారి.

మరింత సమాచారం తెలుసుకోండి: