హుజరాబాద్ ఉప ఎన్నిక  అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నాయని చెప్పవచ్చు. ఒకరినొకరు ద్వేషించుకొంటూ ప్రచారంలో స్పీడ్ పెంచారని చెప్పవచ్చు .. ఇదిలా ఉండగా బీజేపీ మాత్రం హుజరాబాద్ నియోజకవర్గం పై ఢిల్లీ పెద్దల దృష్టి పెట్టి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.  
హుజురాబాద్ పై బిజెపి దండయాత్రకు సిద్ధమవుతోంది. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను  సిద్ధం చేస్తోంది. ఇకపై పూర్తిస్థాయి ప్రచారాన్ని హోరెత్తించడానికి కమలం పార్టీ రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటుంది. కేంద్ర మంత్రుల నుంచి మొదలు బిజెపి శ్రేణులంతా హుజురాబాద్ లో మోహరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చేందుకు స్టార్ క్యాంపెనర్లు రంగంలోకి దిగనున్నారు. ఉప ఎన్నికలకు ఇంకొన్ని రోజులే మిగిలి ఉండడంతో ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. ఈటెల రాజేందర్ గెలుపును బిజెపి భవిష్యత్తుకు నాందిగా కమలనాథులు భావిస్తున్నారట. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని బిజెపి అందిపుచ్చుకోవలను కుంటుంది. రాష్ట్ర పార్టీ నేతల పట్టుదలకు, జాతీయ పార్టీ సైతం మద్దతు ఇస్తోంది.

 దీంతో అధికార పార్టీ ప్రచారానికి ధీటుగా బిజెపి ప్రచారం నిర్వహిస్తోంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లు  ఈటెల గెలుపును తమ భుజాలపై వేసుకున్నారు. వీరితో పాటు ముఖ్య నాయకులు, ఇన్చార్జులు స్టార్ క్యాంపేనర్లు సైతం హుజురాబాద్లో మకాం వేస్తున్నారు .అంతేకాక పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లు సైతం హుజరాబాద్ లో ప్రచారం నిర్వహిస్తారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్  టార్గెట్ గా టిఆర్ఎస్ మంత్రులు హుజురాబాద్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు, హుజరాబాద్ లో తిష్ట వేసి ఈటెల ను టార్గెట్ చేశారు. మొత్తానికి హుజరాబాద్ లో గెలిచి 2023 తెలంగాణ ఎన్నికల్లో కాషాయపు జండా పాతలని కమలనాథులు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: