రాజకీయాల్లో జంపింగ్ నాయకులని ప్రజలు ఎక్కువగా ఎంకరేజ్ చేయరు. ఎలా పడితే అలా పార్టీ మారుతూ...తమ స్వార్ధం కోసం రాజకీయాలు చేసే నాయకులని పక్కనబెట్టేస్తారు. గతంలో టి‌డి‌పి అధికారంలో ఉండగా జంప్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలకు 2019 ఎన్నికల్లో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో అంతా చూశారు. ఇలా పార్టీలు మారే నాయకులకు ప్రజలు చెక్ పెట్టేస్తారు. అయితే పార్టీలు మారినా ప్రజల కోసం నిలబడే నాయకులు గెలవడం మళ్ళీ కష్టం కాదు.
 
మరి ఈ సారి జంప్ చేసిన ఎమ్మెల్యేలని ప్రజలు ఆదరిస్తారా? లేదా? అనేది చూడాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక నలుగురు టి‌డి‌పి ఎమ్మెల్యేలు, వైసీపీలోకి వెళ్లారు. అందులో విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేశ్ కుమార్ టి‌డి‌పి వీడి వైసీపీ వైపుకు వెళ్లారు. విశాఖ టి‌డి‌పిలో వాసుపల్లి కీలక నేతగా ఎదుగుతూ వచ్చారు. 2009లో ఓటమి పాలైన సరే...2014, 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీలతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

అలాగే విశాఖ నగరం టి‌డి‌పి అధ్యక్షుడుగా మంచిగా పనిచేసుకుంటూ వచ్చారు. కానీ టి‌డి‌పి అధికారంలో లేకపోవడం కాస్త ఇబ్బంది అయింది. నియోజకవర్గంలో పనులు ఆగిపోయాయి. దీంతో వాసుపల్లి టి‌డి‌పిని వీడి...తన తనయులకు వైసీపీ కండువా కప్పించి, తాను జగన్‌కు జై కొట్టారు. ఇలా వైసీపీలోకి వెళ్ళిన వాసుపల్లి తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు....సొంత డబ్బులని సైతం ఖర్చు పెడుతూ ప్రజలకు అండగా ఉంటున్నారు.

అయితే ఇలా సౌత్‌లో వాసుపల్లికి తిరుగులేని బలం పెరుగుతూ వస్తుంది. ఇక ఇక్కడ టి‌డి‌పికి సరైన నాయకుడు లేరు. వాసుపల్లి వైసీపీలోకి వెళ్ళాక టి‌డి‌పి తరుపున నాయకుడుని పెట్టలేదు. బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్‌కు బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నారు గానీ అది జరగలేదు. అలా అని వేరే నాయకుడుకు బాధ్యతలు అప్పగించలేదు. మరి విశాఖ సౌత్‌లో టి‌డి‌పి బాధ్యతలు చూసుకునే నాయకుడుని బట్టే వాసుపల్లి గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. బలమైన నాయకుడు వస్తే వాసుపల్లికి ఇబ్బంది...లేదంటే మళ్ళీ గెలవడం సులువే.  

మరింత సమాచారం తెలుసుకోండి: