చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మళ్ళీ వైసీపీ ఆధిక్యం దక్కించుకుంటుందా? మళ్ళీ టి‌డి‌పికి లీడ్ రాదా? అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్తితులని బట్టి చూస్తే చిత్తూరులో టి‌డి‌పికి మళ్ళీ లీడ్ వచ్చేలా కనిపించడం లేదు. ఎలాగో గత రెండు ఎన్నికల నుంచి చిత్తూరులో వైసీపీదే ఆధిక్యం. ఇక్కడ వైసీపీకి టి‌డి‌పి ఏ మాత్రం చెక్ పెట్టలేకపోతుంది. పేరుకు బాబు సొంత జిల్లా గానీ...ఇక్కడ టి‌డి‌పికి ఏ మాత్రం పట్టు ఉండదు.

అయితే నెక్స్ట్ ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి కూడా చిత్తూరులో వైసీపీ పై చేయి సాధించడం ఖాయమని తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. ఈ 14 సీట్లలో గత ఎన్నికల్లో వైసీపీ 13 గెలుచుకుంది...ఇక టి‌డి‌పికి ఒక కుప్పం మాత్రం వచ్చింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి 13 సీట్లు వచ్చేస్తాయా? అంటే అది చెప్పలేం. ఎందుకంటే కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు పెద్దగా ఏమి బాగోలేదు. పైగా కొన్నిచోట్ల టి‌డి‌పి నేతలు గట్టి పోటీ ఇస్తున్నారు.

అలాంటప్పుడు వైసీపీకి సేమ్ రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశాలు లేవు. అయితే చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ చాలా ఎత్తులు వేస్తుంది. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో సత్తా చాటింది. కానీ సాధారణ ఎన్నికల్లో ఆ పరిస్తితి ఉండదనే చెప్పొచ్చు. మళ్ళీ చంద్రబాబు విజయానికి ఎలాంటి ఢోకా ఉండదని తెలుస్తోంది.


అలాగే పీలేరు, తిరుపతి, నగరి, గంగాధర నెల్లూరు, పలమనేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో వైసీపీకి టి‌డి‌పి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుంగనూరు, తంబళ్ళపల్లె, పూతలపట్టు, చిత్తూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో వైసీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ మొత్తం మీద చూసుకుంటే చిత్తూరు జిల్లాలో ఈ సారి కూడా వైసీపీనే పైచేయి సాధించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp