అంబటి రాంబాబు.. ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు..పేరుకు సీనియర్ నాయకుడు గానీ రాజకీయాల్లో సక్సెస్ మాత్రం చాలా తక్కువ...ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చిన అంబటికి విజయాలు ఎక్కువ రాలేదు. ఏదో మొదట్లో అంటే 1989లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ తరుపున బరిలో దిగి...రేపల్లె నుంచి విజయం సాధించారు. ఇక అంతే ఆ తర్వాత మళ్ళీ అంబటి గెలిచిన దాఖలాలు లేవు. వరుసపెట్టి కొన్నిసార్లు ఓడిపోయారు...కొన్ని సార్లు సీటు దక్కలేదు.

అయితే జగన్ దయ వల్ల అంబటికి మరొకసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది. 2014లో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయిన అంబటి 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో వైసీపీ తరుపున బరిలో దిగి సత్తెనపల్లిలో విజయం సాధించారు. ఇలా చాలా ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి....మంత్రి పదవిపై కూడా బాగా ఆశపెట్టుకున్నారు. మొదట విడతలో సామాజికవర్గాల సమీకరణాల్లో అంబటికి మంత్రి పదవి రాలేదు.

కానీ ఈ సారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని అంబటి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పైగా ఇదే మంత్రి అవ్వడానికి చివరి అవకాశం అని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పలేం. ఇప్పటికే పలు కారణాల వల్ల అంబటి ఇమేజ్ కాస్త డ్యామేజ్ జరిగింది. అంబటిపై అనేక ఆరోపణలు వచ్చాయి...అవి నిజమో కాదో తెలియదు గానీ వాటి వల్ల అంబటికి కాస్త నష్టం జరిగింది.


దీని వల్ల నెక్స్ట్ ఎన్నికల్లో అంబటి పరిస్తి ఏంటి అనేది అర్ధం కాకుండా ఉంది. పైగా నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేనలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే సత్తెనపల్లిలో అంబటికి గెలిచే అవకాశాలు తక్కువ అవుతాయి. సరే అంబటి గెలిచినా...వైసీపీ అధికారంలోకి రావాలి. ఈ రెండిటిలో ఏది జరగకపోయినా అంబటికి మంత్రి అయ్యే ఛాన్స్ లేదు. అందుకే ఇప్పుడే మంత్రి పదవి దక్కించుకోవాలని అంబటి చూస్తున్నారు. మరి అంబటికి చివరి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: