గత ఎన్నికల్లో ఘోర ఓటమిని జనసైనికులు అంత సులువుగా మరిచిపోరనే చెప్పాలి. అలాగే జనసేనకు రాపాక వరప్రసాద్ చేసిన ద్రోహాన్ని కూడా తేలికగా మరిచిపోరు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో అంత దారుణమైన ఓటమిలో కూడా జనసేనకు కాస్త ఊరటనిచ్చిన అంశం ఏదైనా ఉందంటే అది...రాజోలులో రాపాక వరప్రసాద్ జనసేన తరుపున ఎమ్మెల్యేగా గెలవడం. పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారనే బాధని రాజోలు ప్రజలు కాస్త మరిచిపోయేలా చేశారని చెప్పొచ్చు.

అలా జనసేన తరుపున గెలిచిన రాపాక కొద్దిరోజుల్లోనే పవన్‌కు హ్యాండ్ ఇచ్చేశారు. వైసీపీ అధికారంలో ఉండటంతో నిదానంగా ఆ పార్టీ వైపు జరుగుతూ వెళ్ళిపోయారు. జగన్‌కు భజన చేస్తూ..వైసీపీ నేత మాదిరిగా మారిపోయారు. ఒకానొక సమయంలో తాను వైసీపీ నుంచే పోటీ చేద్దామని అనుకున్నానని కానీ, సీటు దొరకక జనసేనలోకి వచ్చి పోటీ చేసి గెలిచానని చెప్పుకొచ్చారు. అంటే తన సొంత ఇమేజ్‌తోనే గెలిచానని రాపాక డప్పు కొట్టేసుకున్నారు.

ఇక అలా అలా రాపాక వైసీపీ ఎమ్మెల్యేగా మారిపోయారు. ఎప్పుడైతే రాపాక, పవన్‌కు ద్రోహం చేసి వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు...అప్పటినుంచి రాజోలు జనసేన శ్రేణులు రాపాకని ఓడించాలనే కసితో ఉన్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో రాపాకకు సీటు దక్కుతుందో లేదో క్లారిటీ లేదు. ఒకవేళ సీటు వస్తే ఓకే లేకపోయినా వైసీపీని రాజోలు బరిలో వైసీపీని మళ్ళీ ఓడించాలని జనసైనికులు చూస్తున్నారు.

ఒకవేళ టి‌డి‌పితో పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకే దక్కుతుంది. పైగా టి‌డి‌పి సపోర్ట్ ఉంటే రాజోలులో జనసేన....వైసీపీకి చెక్ పెట్టడం చాలా సులువు. ఒకవేళ వైసీపీ తరుపున రాపాక బరిలో దిగితే, ఆయనకు చుక్కలు చూపించాలని జనసైనికులు కాచుకుని కూర్చున్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో టి‌డి‌పితో పొత్తు పెట్టుకుని జనసేన సత్తా చాటింది. నెక్స్ట్ ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు. మొత్తానికైతే రాజోలు సీటులో మళ్ళీ జనసేన గెలవడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: