ప్రతి ఎన్నికకు రాజకీయాల్లో మార్పు వచ్చేస్తుంది....ప్రజలు కూడా ఒకోసారి ఒకో పార్టీని ఆదరిస్తున్నారు. కంటిన్యూగా ఒకే పార్టీని ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు. కానీ అధికారంలో ఉన్న పార్టీలు మాత్రం....శాశ్వతంగా తమదే అధికారం అనే పరిస్తితిలో ఉంటున్నాయి. అంటే ప్రజలు అలాంటి ఫీలింగ్ వచ్చేలా చేస్తున్నారు. ఎందుకంటే అధికార పార్టీకి బాగా అండగా ఉంటున్నట్లే కనిపిస్తున్నారు. కానీ అసలు ఎన్నికలోచ్చేసరికి బొమ్మ చూపిస్తున్నారు.

2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టి‌డి‌పి అలాగే అనుకుంది...ఇక చంద్రబాబు ఇంకో 20 సంవత్సరాలు సి‌ఎంగా ఉండిపోతారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. పైగా టి‌డి‌పి అధికారంలో ఉండగా ప్రజలు కూడా చంద్రబాబు వైపే ఉన్నట్లే కనిపించారు. కానీ 2019 ఎన్నికలోచ్చేసరికి అసలు బొమ్మ చూపించారు. బాబుని చిత్తుగా ఓడించి జగన్‌కు భారీ మెజారిటీ కట్టబెట్టారు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ సైతం...ఇక తమకు తిరుగులేదని అనుకుంటుంది. జగన్ మరో 30 ఏళ్ల పాటు సి‌ఎంగా ఉంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు.


స్థానిక ఎన్నిక ఫలితాలు చూసి వైసీపీ నేతలు సంబరపడిపోతున్నారు. అసలు ఇంకా తమకు తిరుగులేదని అనుకుంటున్నారు. కానీ ఎన్నికలోచ్చేసరికి అసలు సీన్ కనిపిస్తుందని చెప్పొచ్చు. గతంలో వచ్చిన  ఫలితాలు వైసీపీకి రావనే చెప్పాలి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఫలితాలు తారుమారవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. 2014 ఎన్నికల్లో టి‌డి‌పి-బి‌జే‌పిలు కలిసి జిల్లాలో ఉన్న 15 సీట్లు గెలుచుకున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 13 సీట్లు గెలుచుకుంటే, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది.

కానీ నెక్స్ట్ ఎన్నికల్లో సీన్ మారిపోతుందని అర్ధమవుతుంది. ఈ సారి టి‌డి‌పికి ఎక్కువ సీట్లు వచ్చేలా కనిపిస్తోంది. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే వెస్ట్‌లో వైసీపీకి బొమ్మే అని చెప్పొచ్చు. టి‌డి‌పి-జనసేనలు మెజారిటీ సీట్లు గెలుచుకుని వైసీపీ ఒకటి, రెండు సీట్లకు పరిమితమైన ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి ఈ సారి వెస్ట్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: