రాజకీయ నాయకుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో స్టయిల్ ఉంటుంది. కొందరికి కొన్నిప్లస్ పాయింట్లు ఉంటాయి. కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. కొందరు నాయకులు ఎంత గొప్పవాళ్లయినా కొన్ని బలహీనతలను అధిగమించలేరు. కానీ వారిలో ఉన్న ఇతర నాయకత్వ లక్షణాలు ఆ బలహీనతలను కప్పేస్తాయి. చంద్రబాబు విషయం తీసుకుంటే.. ఆయన ఓ గొప్ప నాయకుడు. మంచి మేనేజ్‌మెంట్ లక్షణాలు ఉన్న నాయకుడు.. అలాగే మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలిసినవాడు. బుద్ధిబలంతో పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడంలో నేర్పరి. అందుకే దాదాపు 15 ఏళ్లపాటు సీఎంగా సేవలు అందించారు.


అయితే.. అదే చంద్రబాబుకు కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఆయన చక్కగా ప్రసంగించలేరు. ఆయన మంచి కమ్యూనికేటర్ కారు. ఎలాంటి విషయాన్నయినా ఒకే పద్దతిలో చెప్పడం చంద్రబాబు ప్రసంగాల్లో చూస్తాం. వాయిస్ మాడ్యులేషన్ గానీ.. సౌండ్‌ కానీ.. ఏ ప్రసంగంలోనూ పెద్దగా తేడాలు ఉండవు. అలాగే మంచి మాటకారి కూడా కాదు. ఆయన కొద్దిసేపు మాట్లాడితేనే జనానికి బోర్ కొట్టేస్తుంటుంది. అందులోనూ అన్ని సమావేశాల్లోనూ ఒకే విషయాన్ని రిపీట్ చేయడం చంద్రబాబుకు ఉన్న ఓ పెద్ద మైనస్ పాయింట్.. కానీ.. కేసీఆర్ విషయం ఇందుకు భిన్నం. ఆయన ఏం మాట్లాడినా.. ఆసక్తిగా చెప్పగలుగుతారు.


అయితే.. ఇప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబులా తయారవుతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే.. తాజాగా మోత్కుపల్లి నరసింహులు పార్టీలోకి వచ్చిన సమయంలో కేసీఆర్ చేసిన ప్రసంగం ఒక్కసారిగా చంద్రబాబును తలపించింది. ఇటీవల దళిత బంధు రాగం ఆలపించిన కేసీఆర్.. ఈ అవకాశాన్ని కూడా ఆ పథకం ప్రచారం కోసమే చాలా వరకూ వాడుకున్నారు. తన ప్రసంగంలో చాలా వరకూ దళిత బంధు పథకం గురించే మాట్లాడారు. విశేషం ఏంటంటే.. ఇవన్నీ ఇటీవల దాదాపు అన్ని సభల్లోనూ చెబుతున్నవే.. కొత్త పాయింట్లు పెద్దగా ఏమీ లేవు. అంటే.. చెప్పిందే చెప్పండ అన్నమాట. ఇది చంద్రబాబు స్టయిల్.. ఈ ప్రసంగం విన్న తర్వాత కేసీఆర్ కూడా చంద్రబాబు తరహాలోనే బోర్ కొట్టిస్తున్నారా అన్న అనుమానం వస్తోంది. కేసీఆర్ జర జాగ్రత్త.. అలాంటి పేరు తెచ్చుకోకండి.


మరింత సమాచారం తెలుసుకోండి: