తెలంగాణ ప్ర‌భుత్వం ద‌ళితుల అభివృద్ధికోసం ద‌ళిత‌బంధు ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విధిత‌మే. ఇందుకు అనేక ఆటంకాలు ఎదుర‌య్యాయి. డ‌బ్బులు ల‌బ్ధిదారుల అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ కాకుండా అడ్డ‌క‌ట్ట ప‌డింది. దీంతో ఆ ప‌థ‌కం కొద్దిరోజుల పాటు బంద్‌కానుంది. దీనిపై టీఆర్ఎస్ నేత‌లు ప్ర‌తిప‌క్షాల వ‌ల్ల‌నే ద‌ళిత‌బంధు ఆగిపోయింద‌ని పేర్కొంటున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌మాత్రం సీఎం వ‌ల్ల‌నే ద‌ళిత బంధుకు బ్రేకు ప‌డింద‌ని మండిప‌డ్డారు. దీనికోసం సీఎం కేసీఆర్ నైతిక‌బాధ్య‌త వ‌హించి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేసారు.

ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లును ఆపివేసేలా ఎన్నిక‌ల సంఘానికి అవ‌కాశం ఇచ్చిన‌ది సీఎం కేసీఆర్ అని ఫైర‌య్యారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌కుండా అడ్డుకుంటుంద‌ని తెలిసే ద‌ళిత బంధుపై చిలుక పలుకులు పలికార‌ని ఎద్దేవా చేశారు. కొన‌సాగుతున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ ఎప్పుడు కూడ‌ నిలిపివేయ‌దు అని గుర్తుచేశారు. హుజూరాబాద్‌లో ద‌ళిత బంధ్ జ‌రిగిన విష‌యం విధిత‌మే. ఇందుకోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌కంగా ఆదేశించింది. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌ధానధికారికి ఈసీ లేఖ రాసిన‌ది. దీంతో ఉపఎన్నిక ప్ర‌క్రియ కొన‌సాగేవ‌ర‌కు ద‌ళిత‌బంధుకు అడ్డుక‌ట్ట ప‌డ‌నున్న‌ది. దీనిపై ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ఈసీకి ఫిర్యాదు చేసిన‌ది. కేవ‌లం హుజూరాబాద్‌లో ఆపాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ సంబంధించిన ప‌ద్మ‌నాభ‌రెడ్డి వెల్ల‌డించాడు. త‌మ‌కు అస‌లు రాజ‌కీయాల‌తో సంబంధ‌మే లేద‌ని పేర్కొన్నారు.

ఎన్నిక‌ల వేళ‌లో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం రాజ్యాంగానికి విరుద్ధం.  ఎన్నిక‌ల‌లో ల‌బ్ధిపొందేందుకు ఇలాంటి ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంటార‌ని ఆయ‌న వివ‌రించారు. తొలుత ప‌థ‌కం అమ‌లు చేయ‌డానికి నియోజ‌క‌వ‌ర్గానికి 100 కుటుంబాల‌ను సెల‌క్ట్ చేస్తామ‌ని చెప్పి.. అందుకు విరుద్ధంగా కేవ‌లం హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనే అన్ని ద‌ళిత కుటుంబాల‌కు నిర్ణ‌యించడం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఈసీకి ఇదివ‌ర‌కే ఫిర్యాదు చేశాం. కానీ కొంత ఆల‌స్యంగా వ్య‌వ‌హ‌రించద‌ని వెల్లడించాడు. ద‌ళిత బంధు అంద‌జేయ‌డం నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. కానీ రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేస్తే బాగుంటుంది. కేవ‌లం ఎన్నిక‌లు జ‌రిగే హుజూరాబాద్ అన్ని కుటుంబాల‌కు అంద‌జేసి.. మిగ‌తా ప్రాంతాల్లో ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌నే అభ్యంత‌రంతోనే ఫిర్యాదు చేసిన‌ట్టు వివ‌రించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: