భారీగా అప్పులలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా ను కేంద్రప్రభుత్వం టాటా సంస్థకు కట్టబెట్టింది, అది కల్పవృక్షం అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిని ఆ సంస్థ ప్రతినిధి కూడా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియా విషయంలో తీసుకున్న నిర్ణయం సరయినదే అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా స్పష్టం చేసింది. భారత్ ఈ తరహా సంస్కరణలు, సరళీకరణ విధానాల తో ముందుకు పోవటం ఎంతైనా మంచిదని, అప్పుడే కరోనా వలన ఎదుర్కొన్న సవాళ్ల నుండి వేగంగా బయటపడవచ్చు అనేది సంస్థ అంచనా వేసింది. దానికి మొదటి మెట్టుగా ఎయిర్ ఇండియా పై భారత్ తీసుకున్న నిర్ణయమే అవుతుందని సంస్థ అబిప్రాయపయం వ్యక్తం చేసింది.

కరోనా సమయంలో ఇతర దేశాలకు కూడా వాక్సిన్ పంపిణి చేయడం వలన అంతర్జాతీయంగా తన బాధ్యతల పై చిత్త శుద్దిని నిరూపించింది అని సంస్థ పేర్కొంది. ఈ సమయంలో కూడా భారత్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ఎంతో సానుకూలమైన విషయం. భారత్ సరళీకృత విధానాల వలన గత కొన్ని ఏళ్లగా వ్యవసాయం, రక్షణ, టెలికమ్యూనికేషన్ సేవలు, భీమా రంగాలలో విదేశీ పెట్టుబడులు భారీగా ఆకర్షించగలిగింది. దీనితో కరెంటు ఖాతా ఫైనాన్సింగ్ పద్దతి మెరుగుపడింది. అందుకే అందర్జాతియ ఒడిదుడుకులను భారత్ తట్టుకోగలిగింది.  ఇంకా బయో టెక్నాలజీ, రక్షణ, డిజిటల్ మీడియా, ఔషధ రంగాలలో కూడా భారత్ రానున్న రోజులలో పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు ఆకర్శించే అవకాశాలు ఉన్నాయి.

ఈ సరళీకృత విధానాలు భూమి, కార్మిక రంగాల కు సంబంధించి న వ్యవస్థాగత సంస్కరణలు కూడా మద్దతు ఉండటం మరియు పాలనా, నియంత్రణ, న్యాయ వ్యవస్థల పటిష్ఠతకు సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. కరోనా వలన గడిచిన ఏడాదిన్నర నుండి ప్రపంచం అంతా ఇబ్బందులు పడుతూనే ఉంది. పూర్తిగా ఈ వైరస్ ప్రపంచాన్ని వదిలే వరకు ఎవరూ సురక్షితం కాదు.  ఈ పరిస్థితులలో కూడా భారత్ రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా(ఆర్బీఐ) తీసుకువచ్చిన అనేక పాలనా, ద్రవ్యపరమైన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. సామాన్యులకు ఆహార భద్రతా ఇవ్వడంలో ఇవన్నీ దోహద పడ్డాయి. ప్రస్తుతం ఆరోగ్య రంగంలో ప్రపంచం కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా మాత్రమే వైరస్ ను పూర్తిగా వదిలించుకోవచ్చు. వైద్యరంగం తోపాటుగా విద్యారంగం సమాజాభివృద్ధికి అత్యవసరం. ఆ దిశగా అన్ని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

imf