చరిత్ర చెప్పుకుంటూ కూర్చుంటే చరిత్రలో కలిసిపోతాం. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవ్వాలి. కొత్త ఆవిష్కరణలతో కాలంతో పరిగెడుతున్న ప్రపంచం కంటే  ఓ అడుగు ముందే ఉండాలి. అప్పుడే గుర్తింపు బలం పెరిగేది. సామాన్యుడి నుంచి వ్యవస్థ వరకు వర్తిస్తుంది ఇది. డిఫెన్స్ రంగానికి సంబంధించి ఇప్పుడు ఇలాంటి అడుగులే పడుతున్నాయి. ప్రపంచంలోనే భారత్ బలమైన సైనిక శక్తిగా మారబోయే రోజులు రాబోతున్నాయా? దాయాది  దేశాలకు పీడకలలు మిగిల్చబోతున్నామా? ఓవైపు సిగ్గులేని చైనా, మరోవైపు పాపాత్ముల పాకిస్తాన్. బార్డర్ దాటాలని ఒకరు,దాటి దారుణాలు చేయాలని మరొకరు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఓ లెక్క ఇక నుంచి ఓ లెక్క. భారత్ వైపు చూడాలంటే దాయాది దేశాలకు  వెన్నులో వణుకు రావాలి ఆ స్థాయిలో సైనిక వ్యవస్థ ను, రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. రెండు దశాబ్దాలకు పైగా ఎలాంటి మార్పులేని, కనిపించని రక్షణ రంగం పై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లను, కార్పొరేట్ సంస్థలు గా మార్చింది. ప్రధాని మోడీ రక్షణ రంగానికి సంబంధించి 7 పిఎస్యు లను ప్రారంభించారు కూడా. కాలానికి తగినట్లు, టెక్నాలజీకి అనుగుణంగా రక్షణ కర్మాగారాలు అప్ గ్రేడ్ కాలేదు. ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ ను ప్రమోట్ చేయడంతోపాటు రక్షణ రంగాన్ని అప్ గ్రేడ్ చేసే ప్రాసెస్ లో ఏడు కంపెనీలను కేంద్రం తీసుకువచ్చింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు లో ఉన్న బాధ్యతలను ఏడు పిఎస్యు లకు బదిలీ చేస్తారు. ఏడు పిస్యూ లలో మొదటిది మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్. దీనిలో పేలుడు పదార్థాలు, బుల్లెట్ షెల్స్ ఉత్పత్తి అవుతాయి. రెండవది ఆర్మూడ్ వెహికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనిలో ఆర్మీ వాహనాలు తయారవుతాయి. మూడవది అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ దీనిలో ఆయుధాలు, ఆయుధ సామాగ్రి ఉత్పత్తి అవుతాయి. నాల్గవది యంత్ర ఇండియా లిమిటెడ్ దీనిలో యంత్రాలు, పరికరాలు తయారవుతాయి. ఐదవది ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ దీనిలో ఫుడ్, వాటర్,టెక్నికల్ గాడ్జెట్స్ ఇస్తుంది. ఆరవది ఇండియా ఆప్టెల్ లిమిటెడ్  దీనిలో శాటిలైట్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ను తీసుకొస్తారు. ఏడవది గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ దీనిలో సైన్యం కోసం పారచూట్స్ తయారు చేస్తారు.  ఈ ఏడు సంస్థలకు సంబంధించి 65 వేల కోట్ల ఆర్డర్స్ రావడం ఈ సంస్కరణలు ఏ స్థాయిలో దూసుకుపోతున్నాయో, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే దానికి నిదర్శనం గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: