తమిళనాడులో డీఎంకే, ఐడిఎంకే మాదిరిగానే టిఆర్ఎస్ ను తీర్చిదిద్దడం మా లక్ష్యం అన్నారు మంత్రి కేటిఆర్. ఎన్నికల కోసమే పార్టీ నిర్మాణమే అనుకోవడం అవివేకం అని అన్నారు ఆయన. రేవంత్ రెడ్డిని చిలక జోశ్యం చెప్పుకోమనండి అని ఆయన సూచించారు. రేవంత్ ముందు హుజురాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోవాలి అని హితవు పలికారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు అయ్యాయి అని కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టారు అని వ్యాఖ్యలు చేసారు. ఈటెలను గెలిపించుకుని తర్వాత కాంగ్రెస్ లో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు.

దీని వెనుక వివేక్ కూడా ఉన్నారు అని అసలు బీజేపీని ఈటెల ఓన్ చేసుకుంటున్నారా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. అసలు ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో చెబుతున్నారా అని ప్రశ్నించారు. ఈటెల కు ఏం అన్యాయం జరిగింది అని నిలదీశారు. అన్ని పదవువులు అనుభవించారుఅని అన్నారు. పదవిలో ఉంటూ ప్రభత్వ పథకాలను విమర్శించినా కేసీఆర్ భరించారు అని అన్నారు ఆయన. దళితబంధు ఎవరు ఆపినా ఆగదు అని స్పష్టం చేసారు. భట్టివిక్రమార్క నియోజకవర్గ చింతకానికి కూడా నిధులు విడుదల అయ్యాయి అని వివరించారు.

దళితబంధు ఆపామని ఎవరైనా అనుకోవడం అవివేకం అన్నారు ఆయన. 107స్థానాల్లో బీజేపీకి డిపాజిట్ పోయింది అని అందరూ దుప్పటి కప్పుకుని పడుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఒక్క హుజురాబాద్ తో ఏమైనా తలక్కిందులు అవుతుందా అని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ తన బాధలు ప్రపంచ బాధలు అనుకుంటున్నారు అని వ్యాఖ్యలు చేసారు. నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఫార్ములనే బీజేపీ, కాంగ్రెస్ లు హుజురాబాద్ లో అమలు చేస్తున్నాయి అని తెలిపారు. జీవన్ రెడ్డి నియోజకవర్గం జగిత్యాలలో కాంగ్రెస్ కు ఓట్లు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో పీసీసీ నే గట్టి అక్రమార్కులదే నడుస్తోంది అని భట్టి మంచోడు... ఆయనది కాంగ్రెస్ లో ఏం నడుస్తలేదు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు.. షర్మిల చేసుకోవచ్చు అని 15తర్వాత మేము ఒక టీం తమిళనాడు కు వెళుతున్నాం అని పేర్కొన్నారు. అక్కడ డీఎంకే, ఏఐడిఎంకే పార్టీల నిర్మాణం పై అధ్యయనం చేస్తాం అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts