ఆంధ్రప్రదేశ్ లో గంజాయి అమ్మకాల పై మీడియా మాట్లాడిన టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు చేసిన విమర్శలు సంచలనం అయ్యాయి. తెలంగాణ పోలీసులు వచ్చి ట్రైబల్స్ పై దాడి చేస్తే ఏపి పోలీసులు ఏం చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు రావడం ఏపి పోలీసులకు సిగ్గు చేటన్న ఆనంద బాబు, గిరిజనులపై దాడి చేస్తే మాట్లాడే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి గా మీడియా తో మాట్లాడే స్వేచ్చ మాకు లేదా అని నిలదీశారు. ప్రస్తుత డీజీపి కొత్త సంస్కృతికి తెస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. మా ప్రభుత్వంలో పోలీసులు ఇలానే పని చేశారా అని నిలదీశారు.

ఇక మీడియా లో ఏ ఆధారాలతో మాట్లాడారో చెప్పాలని వైజాగ్ పోలీసులు ఆయనను ప్రశ్నించారు. అలాగే స్టేట్ మెంట్ రికార్డు చేసుకుంటామని  కూడా పోలీసులు అడగడం గమనార్హం. ఇక ఆయన ప్రెస్ మీట్ పై నర్సీపట్నం సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ... మొన్న చింతపల్లిలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది అని వివరించారు. నాయకుల ప్రమేయం లేకుండా గంజాయి స్మగ్లింగ్ అనేది జరగదని మాజీమంత్రి ఆనంద్ బాబు కామెంట్స్ చేసారు అని అన్నారు. చాలా మంది నాయకుల ప్రమేయం ఈ గంజాయి స్మగ్లింగ్ లో ఉండుంటుందని మాట్లాడారు అని ఆయన పేర్కొన్నారు.

ఆ వ్యాఖ్యాలపై మాకు ఆధారాలు లభిస్తాయని వైజాగ్ నుంచి గుంటూరు వచ్చాం అని పేర్కొన్నారు. అధారాలు ఉండబట్టే అలా మాట్లాడారని అనుకుంటున్నాం అని గంజాయి స్మగ్లింగ్ వ్యాఖ్యాలపై ఆనంద్ బాబును స్టేట్మెంట్ ఇవ్వాలని అడిగాం అన్నారు ఆయన. అర్థరాత్రి ఇవ్వను అన్నారు, అందుకే ఉదయం వస్తామన్నాం అని తెలిపారు. స్టేట్మెంట్ ఇవ్వకుంటే 91 సిఆర్ఫీఎఫ్ కింద నోటీసులు ఇస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు కచ్చితంగా చింతపల్లి వచ్చి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది  అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: