ప్రస్తుతం కాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.  ఏదో ఒక సాకుతో సైబర్‌ నేర గాళ్లు రెచ్చి పోతున్నారు.  ప్రస్తుతం వస్తున్న  సిటీలో  పెరిగిపోతున్నారు సైబర్ నేరాల బాధితులు. అమాయక ప్రజలే కాకుండా... చదువుకున్న వారిని టార్గెట్‌ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు.  ఏదో ఒక రూట్‌ ద్వారా....  చదువుకున్న వారి, చదువు లేని వారి పట్ల అదే విధంగా సైబర్‌ నేరగాళ్లు.. టోకరా పెడుతున్నారు.  ముఖ్యంగా ఈ సైబర్‌ నేరాలు హైదరాబాద్‌ మహ నగరం లో విపరీతంగా పెరిగి పోతున్నాయి. 

ఎక్కువగా సాఫ్ట్‌ వేర్‌ జాబ్స్‌ చేసే వారినే టార్గెట్‌ చేస్తున్నారు ఈ సైబర్‌ నేరగాళ్లు.   ఓఎల్ఎక్స్ , ఓటిపి , క్యూఆర్ కోడ్ నేరాలతో రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు. సనత్ నగర్ కు చెందిన డిజైనర్ ఓఎల్ఎక్స్ లో రిఫ్రిజిరేటర్ ను అమ్మకానికి పెట్టగా క్యూ అర్ కోడ్ పంపి దఫ దఫాలుగా ఏడు లక్షలు కాజేసారు సైబర్ నిందితులు. ఓల్డ్ ఆల్వాల్ కు చెందిన బ్యాంకు ఉన్నతాధికారి సోఫా అమ్మకానికి పెట్టగా మూడున్నర లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. కౌకూర్ కు చెందిన ఓ వ్యాపారి కి వాట్సాప్ ద్వారా బిజినెస్ ఆఫర్ అంటూ మభ్యపెట్టి 46 లక్షలు కాజేశారు సైబర్ నిందితులు.  

చందానగర్ కు చెందిన ఉద్యోగి కి కే బిసి లా టరీ పేరు తో టో కరా వే శారు సై బర్‌ నేర గా ళ్లు. సైబర్ నిందితులను నమ్మి ఏకంగా 15 లక్షలు పోగొట్టుకున్నాడు బాధితుడు.  పండుగ సీజన్లో ను టార్గెట్ చేశారు సైబర్ నిందితులు.  ఈ నేపథ్యం లో నే సై బర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. అయితే.. భాదితుల ఫిర్యాదు నేపథ్యం లో రంగంలోకి దిగిన పోలీసులు... సైబర్‌ నేరగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: